Hailstorm In Assam : అస్సాంలో వడగళ్ల వాన బీభత్సం, 4500 ఇళ్లు ధ్వంసం

అస్సాంలో వడగళ్ల వానవాన బీభత్సం సృష్టించింది. మంగళవారం అర్థరాత్రి (డిసెంబర్ 27,2022) మంగళవారం ఉదయం కురిసిన ఈ వడగళ్ల వాన వానకు దిబ్రూఘర్, చరైడియో, శివసాగర్ మరియు టిన్సుకియా జిల్లాల్లోని 4,500ల ఇళ్లు దెబ్బతిన్నాయి.

Hailstorm In Assam : అస్సాంలో వడగళ్ల వాన బీభత్సం, 4500 ఇళ్లు ధ్వంసం

Hailstorm In Assam

Hailstorm In Assam : అస్సాంలో వడగళ్ల వానవాన బీభత్సం సృష్టించింది. మంగళవారం అర్థరాత్రి (డిసెంబర్ 27,2022) మంగళవారం ఉదయం కురిసిన ఈ వడగళ్ల వాన వానకు దిబ్రూఘర్, చరైడియో, శివసాగర్ మరియు టిన్సుకియా జిల్లాల్లోని 4,500ల ఇళ్లు దెబ్బతిన్నాయి. నాలుగు జిల్లాల్లో కురిసిని ఈ వడగళ్ల వాన వానకు 132 గ్రామాలు అతలాకుతలం అయిపోయాయి.4500 ఇళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయని అస్సాం రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన శాఖ అధికారులు తెలిపారు.

ఈ బీభత్సానికి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 18వేల మంది నిరాశ్రయులయ్యారు. బాధితులకు తాత్కాలిక ఉపశమనం కోసం టార్పాలిన్‌ పట్టాలను అందజేసారు అధికారులు. ఈ వడగళ్ల వానకు ఇళ్లతో పాటు పలు స్కూల్ భవనాలు దెబ్బతిన్నాయి. పంటలు నష్టపోయాయి.

ఈ వడగళ్ల వాన నష్టాన్ని అధికారులు అంచనావేస్తున్నారు. బాధితులకు ప్రభుత్వం అన్నివిధాల సహయం అందిస్తుందని అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ ప్రకటించారు. వడగళ్ల వానకు సంబంధించిన వీడియోను సీఎం ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.