Orissa High Court: పెళ్లి చేసుకుంటానని నమ్మించి శృంగారంలో పాల్గొంటే రేప్‌గా పరిగణించలేం: ఒడిశా హైకోర్టు

జస్టిస్ ఎస్‌కే పాణిగ్రాహి ఆధ్వర్యంలోని సింగిల్ జడ్జ్ బెంచ్ తాజా తీర్పు ఇచ్చింది. ఒడిశాలోని నిమపాదకు చెందిన ఒక మహిళను ఒక వ్యక్తి పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. తర్వాత అతడు ఆమెను తీసుకుని, భువనేశ్వర్ వెళ్లాడు. అక్కడ ఇద్దరూ కొంతకాలంపాటు కలిసే ఉన్నారు.

Orissa High Court: పెళ్లి చేసుకుంటానని నమ్మించి శృంగారంలో పాల్గొంటే రేప్‌గా పరిగణించలేం: ఒడిశా హైకోర్టు

Orissa High Court: పెళ్లి చేసుకుంటానని నమ్మించి, ఒక మహిళతో శృంగారంలో పాల్గొంటే ఆ చర్యను రేప్‌గా పరిగణించలేమని వ్యాఖ్యానించింది ఒడిశా హైకోర్టు. పరస్పర అంగీకారంతో శృంగారంలో పాల్గొంటే అది రేప్ కిందకు రాదని కోర్టు తీర్పు వెలువరించింది.

Telangana: తెలంగాణను వణికిస్తున్న చలి.. సాధారణంకన్నా 3-5 డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు

జస్టిస్ ఎస్‌కే పాణిగ్రాహి ఆధ్వర్యంలోని సింగిల్ జడ్జ్ బెంచ్ తాజా తీర్పు ఇచ్చింది. ఒడిశాలోని నిమపాదకు చెందిన ఒక మహిళను ఒక వ్యక్తి పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. తర్వాత అతడు ఆమెను తీసుకుని, భువనేశ్వర్ వెళ్లాడు. అక్కడ ఇద్దరూ కొంతకాలంపాటు కలిసే ఉన్నారు. తనను పెళ్లి చేసుకుంటానని అతడు చెప్పడంతో, ఆమె అతడితో శృంగారంలో పాల్గొంది. కొద్ది రోజుల తర్వాత అతడు ఆమెను వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో అతడిపై ఆమె పోలీస్ కేసు నమోదు చేసింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, శారీరకంగా లొంగదీసుకున్నాడని, తర్వాత పెళ్లి చేసుకోకుండా వెళ్లిపోయాడని, అతడిపై అత్యాచారం కేసు నమోదు చేయాలని బాధితురాలు ఫిర్యాదు చేసింది.

Vijaya Shanthi: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పుపై విజయశాంతి ట్వీట్.. క్లారిటీ వచ్చేసినట్లేనా?

దీంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఈ అరెస్టును సవాలు చేస్తూ నిందితుడు ఒడిశా హైకోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారణ జరిపిన కోర్టు తాజాగా నిందితుడికి బెయిల్ మంజూరు చేసింది. ‘‘పెళ్లి చేసుకుంటానని నమ్మించి, శృంగారంలో పాల్గొంటే దాన్ని అత్యాచారంగా పరిగణించలేం. అది పరస్పర అంగీకారంతో జరిగింది కాబట్టి, రేప్‌గా భావించలేం’’ అని చెబుతూ నిందితుడికి కోర్టు కండిషనల్ బెయిల్ మంజూరు చేసింది. తదుపరి విచారణకు పూర్తి స్థాయిలో సహకరించాలని నిందితుడిని ఆదేశించింది.