ICC Under-19 Women’s World Cup : ఐసీసీ అండర్-19 ఉమెన్స్ వరల్డ్ కప్.. భారత కెప్టెన్ గా షఫాలీ వర్మ ఎంపిక

ఐసీసీ అండర్ 19 ఉమెన్స్ వరల్డ్ కప్ కోసం టీమ్ ఇండియా కెప్టెన్ గా స్టార్ బ్యాట్ ఉమెన్ షఫాలీ వర్మ ఎంపికైంది. అండర్ 19 మహిళల ప్రపంచకప్ తో పాటు దక్షిణాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్ కు సెలక్షన్ కమిటీ జట్టును ప్రకటించిందని బీసీసీఐ తెలిపింది.

ICC Under-19 Women’s World Cup : ఐసీసీ అండర్-19 ఉమెన్స్ వరల్డ్ కప్.. భారత కెప్టెన్ గా షఫాలీ వర్మ ఎంపిక

Shafali Verma

ICC Under-19 Women’s World Cup : ఐసీసీ అండర్ -19 ఉమెన్స్ వరల్డ్ కప్ కోసం భారత కెప్టెన్ గా స్టార్ బ్యాట్ ఉమెన్ షఫాలీ వర్మ ఎంపికైంది. అండర్ 19 మహిళల ప్రపంచకప్ తో పాటు దక్షిణాఫ్రికాతో జరిగే టీ-20 సిరీస్ కు సెలక్షన్ కమిటీ జట్టును ప్రకటించిందని బీసీసీఐ తెలిపింది. ఐసీసీ అండర్ -19 మహిళల ప్రపంచకప్ మొదటి ఎడిషన్ లో 16 జట్లు పాల్గొంటాయి. 2023 జనవరి 14 నుంచి 29 వరకు దక్షిణాఫ్రికాలో మెగా టోర్నీ జరుగనుంది. దక్షిణాఫ్రికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తోపాటు స్కాట్లాండ్ తో కలిసి భారత్ గ్రూప్ డీలో కొనసాగుతోంది.

ప్రతి గ్రూప్ నుంచి మొదటి మూడు జట్లు సూపర్ సిక్స్ రౌండ్ కు చేరుకుంటాయి. సూపర్ సిక్స్ లో 6 గ్రూపులు ఉంటాయి. ప్రతి గ్రూప్ నుంచి మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీ ఫైనల్ కు చేరుకుంటాయి. జనవరి 27న పొట్చెస్ట్రూమ్ లోని జేబీ మార్క్స్ ఓవల్ మైదానంలో జరుగనుండగా ఫైనల్ మ్యాచ్ జనవరి 29న అదే మైదానంలో నిర్వహించనున్నారు.

Women Asia Cup 2022: మహిళల ఆసియా కప్ విజేత భారత్.. ఏడోసారి కప్పు గెలిచిన టీమిండియా

అయితే భాతర్ ఉమెన్స్ జట్టుకు షఫాలీ వర్మ ప్రాతినిథ్యం వహిస్తోంది. ఆమె ఇటీవల బ్యాటింగ్ లో రాణిస్తోంది. షఫాలీలోపాటు రిషా ఘోష్ సైతం భారత జట్టుకుప్రాతినిధ్యం వహించారు. జాతీయ జట్టుకు ఆడిన వీరిద్దరి అనుభవం జట్టులోని మిగతా ప్లేయర్స్ కు ఉపయోగపడనుంది. మహిళల అండర్ -19 ప్రపంచ కప్ ను నిర్వహింస్తుండటం ఇదే తొలిసారి గమనార్హం.

అండర్ -19 వరల్డ్ కప్ కోసం దక్షిణాఫ్రికా సిరీస్ కు భారత జట్టులో షఫాలీ వర్మ (కెప్టెన్), శ్వేతా సెహ్రావత్ (వైస్ కెప్టెన్), రిచా ఘోష్ (వికెట్ కీపర్), జీ త్రిష, సౌమ్య తివారీ, సోనియా మోహదియా, హర్లీ గాలా, హర్హిత బసు (వికెట్ కీపర్), సోనమ్ యాదవ్, మన్నత్ కశ్యప్, అర్చన దేవి, పార్శ్వి దేవి, పార్శ్వి టిటా సాధు, ఫలక్ నాజ్, షబ్నమ్ ఎండీ, శిఖా, నజ్లా సీఎంసీ, యశ్ శ్రీని ఎంపిక చేసింది. వీటిలో శిఖా, నజ్లా సీఎంసీ, యశశ్రీ రిజర్వు క్రీడాకారులు కావడం గమనార్హం.