Taj Mahal: “తాజ్‌మహల్ కట్టడానికి షాజహాన్ కొటేషన్ ఏం అడగలేదు”

పనాజీలోని ఐకానిక్ కాలా అకాడమీ భవన పునరుద్ధరణ పనులను సమర్థించుకునేందుకు ప్రయత్నించారు గోవా ఆర్ట్ అండ్ కల్చర్ మంత్రి గోవింద్ గౌడ్. ఈ మేరకు అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ.. "తాజ్ మహల్ నిర్మించడానికి షాజహాన్ కొటేషన్‌ను ఆహ్వానించలేదని" అన్నారు.

Taj Mahal: “తాజ్‌మహల్ కట్టడానికి షాజహాన్ కొటేషన్ ఏం అడగలేదు”

Taj Mahal

 

 

Taj Mahal: పనాజీలోని ఐకానిక్ కాలా అకాడమీ భవన పునరుద్ధరణ పనులను సమర్థించుకునేందుకు ప్రయత్నించారు గోవా ఆర్ట్ అండ్ కల్చర్ మంత్రి గోవింద్ గౌడ్. ఈ మేరకు అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ.. “తాజ్ మహల్ నిర్మించడానికి షాజహాన్ కొటేషన్‌ను ఆహ్వానించలేదని” అన్నారు.

ప్రశ్నోత్తరాల సమయంలో గోవా ఫార్వర్డ్ పార్టీ (GFP) ఎమ్మెల్యే విజయ్ సర్దేశాయ్.. రాష్ట్ర రాజధానిలోని కళా అకాడమీ భవనాన్ని పునరుద్ధరించడానికి రూ.49 కోట్ల వర్క్ ఆర్డర్‌ను కేటాయించారన్నారు. ఆర్ట్ అండ్ కల్చర్ డిపార్ట్‌మెంట్ అదే సమయంలో కొన్ని విధానాలను ఎందుకు దాటవేసిందో తెలుసుకోవాలనుకుంటున్నట్లు కోరారు.

తన చర్యను సమర్థిస్తూ.. “తాజ్ మహల్ ఎప్పటికీ శాశ్వతంగా, అందంగా ఉంది, ఎందుకంటే షాజహాన్ దానిని ఆగ్రాలో నిర్మించడానికి ముందు కొటేషన్ అడగలేదు. నా గౌరవనీయ సహోద్యోగి ఖచ్చితంగా ఆగ్రాలోని తాజ్‌మహల్‌ను సందర్శించాలి. దీని నిర్మాణం 1632లో ప్రారంభమైంది 1653లో పూర్తయింది. కానీ నేటికీ అది అందంగా, శాశ్వతంగా కనిపిస్తుంది” అని , గౌడే వివరించారు.

Read Also: తాజ్‌ మ‌హ‌ల్‌, ఆగ్రా కోట స‌హా స్మార‌క చిహ్నాల్లో నేడు ప్ర‌వేశం ఉచితం

“ఇది ఎందుకని అనుకుంటున్నారు? ఎందుకంటే షాజహాన్ తాజ్‌మహల్ నిర్మించేటప్పుడు కొటేషన్లను ఆహ్వానించలేదు. 390 సంవత్సరాల పాటు అలాగే ఉంది,” అన్నారాయన.

సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ మాన్యువల్‌ను ఉల్లంఘించి డిపార్ట్‌మెంట్ టెక్టన్ బిల్డ్‌కాన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు పునరుద్ధరణ పనిని అప్పగించారని సర్దేశాయ్ ఆరోపించారు.