Sharad Pawar: నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవంపై భిన్నంగా స్పందించిన శరద్ పవార్

తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూకు సమాజం పట్ల ఉన్న దృక్కోణానికి పూర్తి భిన్నంగా ఈరోజు కార్యక్రమం జరిగిందని పవార్ అన్నారు. మోడ్రన్ సైన్స్ ఆధారిత సమాజాన్ని ఆవిష్కరించాలనే నెహ్రూ ఆలోచనగా ఉండేదన్నారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిని ఆహ్వానించడం అనేది ప్రభుత్వ బాధ్యత అని గుర్తు చేశారు

Sharad Pawar: నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవంపై భిన్నంగా స్పందించిన శరద్ పవార్

New Parliament Building: నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవాన్ని విపక్షాలు మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నాయి. వారికి దొరికే ప్రతి సందర్భాన్ని వాడుకుని మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే బీజేపీతో అటు దోస్తీ చేస్తూనే ఇటు విపక్షాలతో మాట కలుపుతున్న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ ఈరోజు జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పొద్దుటి నుంచి జరుగుతున్న కార్యక్రమాలు చూసిన తర్వాత తనకు ఏమాత్రం సంతోషం కలిగించలేదని, ప్రారంభోత్సవానికి తాను వెళ్లకపోవడమే మంచిదైందని వ్యాఖ్యానించారు.

Chandrababu Naidu: ఖబడ్దార్ రౌడీల్లారా.. ఎక్కడదాక్కున్నా వదిలేది లేదు: చంద్రబాబు వార్నింగ్

”ఉదయం ప్రారంభోత్సవ కార్యక్రమం చూశాను. ముందు నేను ఆ కార్యక్రమానికి వెళ్లాలని అనుకున్నాను. అక్కడ జరిగిన తంతు చూసిన తర్వాత చాలా బాధ కలిగింది. దేశాన్ని మనం తిరోగమన దిశగా తీసుకువెళ్లాలనుకుంటున్నామా? కొంతమంది వ్యక్తులకే ఈ కార్యక్రమం పరిమితమా? కొద్ది మంది వ్యక్తులు తప్ప అక్కడ మిగతా వారికి అసలు ప్రాధాన్యతే లేదు” అని శరద్ పవార్ సూటిగా ప్రశ్నించారు.

Wrestlers detained: రెజ్లర్ల అరెస్టుపై తీవ్ర వ్యతిరేకత.. ఎవరెవరు ఏమన్నారంటే?

తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూకు సమాజం పట్ల ఉన్న దృక్కోణానికి పూర్తి భిన్నంగా ఈరోజు కార్యక్రమం జరిగిందని పవార్ అన్నారు. మోడ్రన్ సైన్స్ ఆధారిత సమాజాన్ని ఆవిష్కరించాలనే నెహ్రూ ఆలోచనగా ఉండేదన్నారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిని ఆహ్వానించడం అనేది ప్రభుత్వ బాధ్యత అని గుర్తు చేశారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా హాజరయ్యారని, కానీ రాజ్యసభ చైర్మన్ కూడా అయిన ఉపరాష్ట్రపతి అక్కడ లేరని, ఏతావాతా ఈ కార్యక్రమం మొత్తం కొద్దిమంది వ్యక్తులకే పరిమితమైనట్టు కనిపిస్తోందని పవార్ అసంతృప్తి వ్యక్తం చేశారు.