Shraddha Walker: మహారాష్ట్ర పోలీసులు స్పందించి ఉంటే శ్రద్ధా బతికేది.. డేటింగ్ యాప్స్ బ్యాన్ చేయాలి: శ్రద్ధా తండ్రి వికాస్ వాకర్

శ్రద్ధా వాకర్ హత్య తర్వాత తొలిసారిగా ఆమె తండ్రి వికాస్ వాకర్ మీడియాతో మాట్లాడారు. నిందితుడు ఆఫ్తాబ్‌కు మరణ శిక్ష విధించాలని డిమాండ్ చేశాడు. మొబైల్ యాప్స్ విషయంలో నియంత్రణ విధించాలన్నాడు.

Shraddha Walker: మహారాష్ట్ర పోలీసులు స్పందించి ఉంటే శ్రద్ధా బతికేది.. డేటింగ్ యాప్స్ బ్యాన్ చేయాలి: శ్రద్ధా తండ్రి వికాస్ వాకర్

Shraddha Walker: మహారాష్ట్ర పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే శ్రద్ధా వాకర్ బతికి ఉండేదని అభిప్రాయపడ్డారు ఆమె తండ్రి వికాస్ వాకర్. ప్రస్తుతం పోలీసుల విచారణ జరుగుతున్న తీరు విషయంలో సంతృప్తితో ఉన్నట్లు ఆయన చెప్పారు. సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య తర్వాత తొలిసారిగా ఆమె తండ్రి వికాస్ వాకర్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు.

Work From Home: ఐటీ ఉద్యోగులకు కేంద్రం గుడ్‌న్యూస్.. అక్కడి ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్‌కు అనుమతి

ఈ సందర్భంగా పలు అంశాలపై మాట్లాడారు. ‘‘శ్రద్ధా విషయంలో గతంలో మహారాష్ట్ర పోలీసులతో సమస్య ఎదుర్కొన్నాను. వాళ్లు సకాలంలో స్పందించి ఉంటే శ్రద్ధా వాకర్ బతికి ఉండేది. ప్రస్తుతం ఢిల్లీ పోలీసుల విచారణ విషయంలో సంతృప్తితో ఉన్నాను. నా కూతురు మరణం నన్ను కుంగిపోయేలా చేసింది. దీంతో అనారోగ్యానికి గురయ్యా. అందువల్లే మీడియాతో మాట్లాడలేకపోయా. ఢిల్లీ పోలీసుల విచారణ ద్వారా నా కూతురు హత్య విషయంలో న్యాయం జరుగుతుందనుకుంటున్నా. ఆఫ్తాబ్ శ్రద్ధాను ఎలా హత్య చేశాడో అతడికి కూడా అలాగే శిక్ష విధించాలి. ఈ హత్యతో సంబంధం ఉన్న ఆఫ్తాబ్ కుటుంబంతో సహా ప్రతి ఒక్కరికీ శిక్ష పడాలి. ఆ కుటుంబాన్ని కూడా విచారించాలి.

YS.Sharmila: వైఎస్.షర్మిల మరోసారి అరెస్ట్.. ట్యాంక్‍బండ్ వద్ద అరెస్టు చేసిన పోలీసులు

విచారణ నిష్పాక్షికంగా జరిపి, ఆఫ్తాబ్‌కు ఉరి శిక్ష విధించాలి. నా కూతురు ఇంటి నుంచి వెళ్లిపోయేటప్పుడు తాను పెద్దదాన్నని చెప్పింది. దీంతో నేనేం చెప్పలేకపోయా. 18 ఏళ్లు దాటిన పిల్లలకు కౌన్సెలింగ్ ఇప్పించాలి. మొబైల్ యాప్స్ సమస్యగా మారాయి. వాటిపై నియంత్రణ విధించాలి. డేటింగ్ యాప్స్‌పై నిషేధం విధించాలి. రెండేళ్లుగా శ్రద్ధాను సంప్రదించేందుకు ఎన్నోసార్లు ప్రయత్నించా. కానీ, తాను పెద్దగా స్పందించలేదు’’ అని వికాస్ వాకర్ డిమాండ్ చేశారు.