లాక్ డౌన్ కోసం పనిచేస్తే రూ.1000

లాక్ డౌన్ కోసం పనిచేస్తే రూ.1000

భారత ప్రభుత్వం ప్రకటించిన 21రోజుల లాక్ డౌన్ పీరియడ్ ను తప్పకుండా పాటించాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. మంగళవారం రాత్రి 8గంటలకు చేసిన ఈ ప్రకటన తర్వాత హర్యానా గవర్నమెంట్ మరో ఆఫర్ ఇచ్చింది. ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితులకు తట్టుకుని బయటకు వచ్చి పనిచేస్తున్న వారికి ఇంటెన్సివ్‌ల రూపంలో రూ.100 నుంచి రూ.1000 ఇవ్వాలని నిర్ణయించింది. 

ఈ మేరకు హర్యానా క్యాష్ రివార్డు ప్రకటించింది. కొవిడ్ సంఘర్ష్ సేనాని పేరిట స్కీం పేరిట ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. టీనేజర్, యూత్, సీనియర్ సిటిజన్ ఎవరైనా సరే వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు శ్రమిస్తే వారికి ఈ డబ్బును అందజేస్తారు. ఇందులో భాగంగా వారు పద్యం, కథ, గేయం, మెసేజ్, స్పీచ్ ఏదైనా చెప్పి ప్రచారం చేయొచ్చు. ఇవి చేసి తర్వాత సైట్ లో అప్ లోడ్ చేయాలి. 

haryana.mygov.inసైట్ లో వారు చేసిన కార్యక్రమాలు అప్ లోడ్ చేస్తే 100 బెస్ట్ సెలక్ట్ చేసి క్యాష్ రివార్డు అందజేస్తారు. లాక్ డౌన్ సమయంలో 112 గవర్నమెంట్ స్కూళ్లలో 1.87లక్షల స్టూడెంట్ల స్టడీకి ఇబ్బంది రాకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. లెక్చరర్లు క్లాసుల వీడియో రికార్డు చేసి ఆన్ లైన్‌లో అప్ లోడ్ చేస్తున్నారు. 

భారత్‌లో 562 కరోనా కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రభుత్వ సమాచారం ప్రకారం.. 512మంది భారతీయులకు కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటికి 41మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 43మంది విదేశీయులు ఉన్నట్లు రిపోర్ట్ లు చెబుతున్నాయి. 

దేశంలో కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో మరోసారి మార్చి-24 దేశ ప్రజలనుద్దేశించి ప్రధానమంత్రి నరేంద్రమోడీ మాట్లాడారు. అర్థరాత్రి 12గంటల నుంచి దేశం మొత్తం 21 రోజులు లాక్ డౌన్ అవుతుందని మోడీ ప్రకటించారు. దేశ ప్రజలను రక్షించడానికే ఈ నిర్ణయం. జనతా కర్ఫ్యూ కన్నా ఎక్కువ ఆంక్షలు ఉంటాయి. 21 రోజులు పాటు దేశమంతా లాక్ డౌన్ లో ఉంటుంది. ఇది కర్ఫ్యూ లాంటిదేనని ప్రజలకు సూచించారు మోడీ.

See Also | కూరగాయలు, నిత్యవసరాలకు రేట్లు ఫిక్స్. ధర పెంచితే పీడీ యాక్ట్ కింద కేసులు