ఎన్నారై ఉదారత : ఉద్యోగుల భార్యలకూ వేతనాలు

ఎన్నారై ఉదారత : ఉద్యోగుల భార్యలకూ వేతనాలు

Sharjah-based Indian businessman : కరోనా విజృంభణ సమయంలో చాలా కంపెనీలు తమ ఉద్యోగుల జీతాల్లో కోత విధించాయి. మరికొన్ని సంస్థలయితే ఏకంగా ఉద్యోగులను తొలగించాయి. మరికొన్ని సంస్థలు తాత్కాలికంగా ఉద్యోగులను నిలిపేసి.. కొన్ని నెలల తరువాత తిరిగి తీసుకున్నాయి. కానీ.. ఇక్కడ మాత్రం ఓ కంపెనీ యజమాని తన ఉద్యోగులకు జీతాలు ఇవ్వడంతో పాటు, వారి భార్యలకూ జీతాలు ఇస్తున్నారు. అదేమంటే.. కరోనా సంక్షోభ సమయంలో ఉద్యోగులు చూపిన అసాధారణ నిబద్ధతే తనను అలా ప్రేరేపించిందని సంస్థ యజమాని చెప్పారు.

ఆయన ఎవరో కాదు.. షార్జా కేంద్రంగా వ్యాపార లావాదేవీలు నిర్వర్తిస్తున్న భార‌త సంత‌తి వ్యాపార‌వేత్త సోహన్ రాయ్. ఆయన ఎరైజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ప్రమోట‌ర్‌గా ఉన్నారు. క‌రోనా వేళ అసాధార‌ణ నిబ‌ద్ధత ప్రద‌ర్శించిన ఉద్యోగుల భార్యల‌కు రెగ్యుల‌ర్ వేత‌నాలు ఇవ్వాల‌ని నిర్ణయించుకొని తన ఉదారతను చాటుకున్నారు. ఈ సందర్భంగా..ఉద్యోగుల భార్యల వివరాలను యాజమాన్యం సేకరిస్తోంది. కరోనా కారణంగా..తమ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో ఎవరినీ తొలగించలేదని, వారి జీతాలను కూడా తగ్గించలేదని వెల్లడించింది. మూడేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్నే ఉద్యోగుల తల్లిదండ్రులకు పెన్షన్ కూడా అందిస్తోంది. అంతేగాకుండా..చదుకోవడానికి స్కాలర్ షిప్ లను ఇస్తోంది.