Congress Leader Shashi Tharoor: 2024లో బీజేపీకి ఎన్ని సీట్లు తగ్గుతాయో చెప్పిన శశిథరూర్..! వారసత్వ రాజకీయాలపై ఏమన్నారంటే?

దేశంలోని విపక్ష పార్టీలు కలిసికట్టుగా ముందుకు వస్తే మెజార్టీ స్థానాలతో 2024లో ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చని, కానీ, ఆ సమయంలో విపక్షపార్టీలు కలిసికట్టుగా ముందుకు సాగుతాయా? అనేది చెప్పడం కష్టతరమైన అంశమేనని శశిథరూర్ అన్నారు.

Congress Leader Shashi Tharoor: 2024లో బీజేపీకి ఎన్ని సీట్లు తగ్గుతాయో చెప్పిన శశిథరూర్..! వారసత్వ రాజకీయాలపై ఏమన్నారంటే?

Congress Leader Shashi Tharoor

Congress Leader Shashi Tharoor: దేశంలో బీజేపీ ప్రాబల్యం తగ్గిందని, రాబోయే 2024 సార్వత్రిక ఎన్నికల్లో గత ఎన్నికలకంటే బీజేపీకి భారీగా ఎంపీ స్థానాలు తగ్గుతాయని కేరళకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ జోస్యం చెప్పారు. గత ఎన్నికల్లో పుల్వామా, బాలాకోట్ దాడులు చివరి నిమిషంలో బీజేపీకి లాభించాయని, ఈసారి అలాంటి పరిస్థితి ఉండదని అన్నారు. కేరళలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న శశిథరూర్ పలు విషయాలపై మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో 2019 పరిస్థితి పునరావృతం కాదని, బీజేపీకి 50 సీట్లు తగ్గుతాయని అన్నారు. మెజార్టీ కంటే దిగువ ఎంపీ సీట్లుకు బీజేపీ పడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయని తన అంచనాను వెల్లడించారు.

MP Shashi Tharoor: కదలలేని స్థితిలో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ .. ట్విటర్‌లో ఫొటోలు షేర్ చేసిన ఎంపీ

దేశంలోని విపక్ష పార్టీలు కలిసికట్టుగా ముందుకు వస్తే మెజార్టీ స్థానాలతో 2024లో ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చని, కానీ, ఆ సమయంలో విపక్షపార్టీలు కలిసికట్టుగా ముందుకు సాగుతాయా? అనేది చెప్పడం కష్టతరమైన అంశమేనని శశిథరూర్ అన్నారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎవరన్న అంశంపై ఆయన స్పందిస్తూ.. 2026లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉందని, ఇప్పుడే కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎవరనేదానిపై చర్చ అనవసరమని కొట్టిపారేశారు.

Shashi Tharoor: శశి థరూర్‌కు కాంగ్రెస్ షాక్.. గుజరాత్ ప్రచారకర్తల జాబితాలో దక్కని చోటు

వారసత్వ రాజకీయాలపై అడిగిన ప్రశ్నలకు శశిథరూర్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. మనం కాంగ్రెస్ వారసత్వ రాజకీయా గురించి ప్రస్తావించాల్సి వస్తే.. దేశంలో మొత్తం ఉన్న రాజకీయాల గురించికూడా చర్చించాల్సి ఉంటుందని అన్నారు. ములాయం సింగ్ యాదవ్, లాలూ ప్సాద్ యాదవ్, కరుణానిధి, బాల్ ఠాక్రే, శరద్ పవార్ పార్టీల్లో వారి తర్వాతి తరం రాజకీయాల్లో ఉంది ఎవరని ప్రశ్నించారు. కాంగ్రెస్ వారసత్వ రాజకీయాలుపై మాట్లాడే ముందు ఇలాంటివన్నీ బేరీజు వేసుకోవాలంటూ సూచించారు.