Oscars గెలవడం…బాలీవుడ్‌ లో మృత్యువుని ముద్దాడినట్టే, రెహమాన్ కు శేఖర్ కపూర్ మద్దతు

  • Published By: madhu ,Published On : July 27, 2020 / 07:06 AM IST
Oscars గెలవడం…బాలీవుడ్‌ లో మృత్యువుని ముద్దాడినట్టే, రెహమాన్ కు శేఖర్ కపూర్ మద్దతు

ప్రముఖ సంగీత దర్శకుడు రెహమాన్ కు ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు శేఖర్ కపూర్ మద్దతుగా నిలిచారు. నువ్వు అస్కార్ అవార్డు అందుకున్నప్పుడే బాలీవుడ్ హ్యాండిల్ చేయలేనంత టాలెంట్ నీది అని నిరూపితమైందని వెల్లడించారు. ప్రస్తుతం సమస్య ఎందుకు ఏర్పడిందో తెలుసా..? నవ్వు అస్కార్ సాధించిన సంగీత దర్శకుడు అంటూ చెప్పారు.

తన దగ్గరకు సినిమాలు రానీయకుండా..ఓ గ్యాంగ్ ప్రయత్నిస్తోందని..తన గురించి…లేనిపోని వార్త ప్రచారం చేస్తోందని ఇటీవలే సంగీత దర్శకుడు రెహమాన్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఒక్కసారిగా ఆయన చేసిన కామెంట్స్ దుమారం రేపాయి. సినీ నటుడు సుశాంత్ రాజ్ పుత్ ఆత్మహత్య..బాలీవుడ్ లో పరిణామాలు మారిపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రెహమాన్ చేసిన కామెంట్స్ పై శేఖర్ కపూర్ స్పందించారు.

అస్కార్ గెలవడం అంటే..బాలీవుడ్‌ లో మృత్యువుని ముద్దాడినట్టే..అన్నారు. బాలీవుడ్ హ్యాండిల్ చేయలేనంత ప్రతిభ నీలో దాగి ఉందని కొనియాడారు. దీనికి రెహమాన్ స్పందించారు. డబ్బు పోతే తిరిగి సంపాదించుకోవచ్చు…పేరు పోతే..కూడ సంపాదించుకోవచ్చు. కానీ విలువైన సమయాన్ని వేస్ట్ చేస్తే…మళ్లీ ఎంత ప్రయత్నించినా..తిరిగి తెచ్చుకోలేమన్నారు రెహమాన్.

“స్లమ్‌డాగ్ మిలియనీర్” అనే చిత్రంలో ‘జై హో’ అనే పాటకు సమకూర్చిన సంగీతానికి ప్రతిష్ఠాత్మకమైన “గోల్డెన్ గ్లోబ్ అవార్డు”, రెండు ఆస్కార్ అవార్డులను అందుకొన్న తొలి భారతీయుడుగా రెహమాన్ నిలిచారు. రెండు ఆస్కార్‌ అవార్డులను గెలుచుకొని భారతీయ సినిమాను అంతర్జాతీయ వేదికపైకి తీసుకెళ్లిన ఘనత ఆయనకే దక్కుతుంది.ప్రముఖ సంగీత దర్శకుడు రెహమాన్ కు ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు శేఖర్ కపూర్ మద్దతుగా నిలిచారు.