షిర్డీకి వెళ్లే భక్తులకు గమనిక, దర్శనం కొంతమందికి మాత్రమే

షిర్డీకి వెళ్లే భక్తులకు గమనిక, దర్శనం కొంతమందికి మాత్రమే

sai baba

Shirdi Sai Baba temple : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం మళ్లీ ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం షిర్డీ పైనా పడుతోంది. మహారాష్ట్రలో మరలా కరోనా వైరస్ పంజా విసురుతోంది. గత సంవత్సరం మార్చి తర్వాత..ఎలాంటి కేసులు వెలుగుచూస్తున్నాయో..ప్రస్తుతం అదే విధంగా కేసులు నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ, కఠిన ఆంక్షలు విధిస్తోంది. ప్రజలు తు.చ. తప్పకుండా నిబంధనలు పాటించాలని, లేనిపక్షంలో లాక్ డౌన్ ఎదుర్కొనాల్సి వస్తుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హెచ్చరించారు.

maharastra

కేసులు పెరుగుతున్న దరిమిలా..షిర్డీకి వచ్చే భక్తుల విషయంలో పలు నిబంధనలు అమలు చేస్తున్నారు. ఆలయ దర్శన వేళల్లో మార్పులు చేశారు. ఉదయం 06 గంటల నుంచి రాత్రి 09 గంటల వరకు మాత్రమే సాయిబాబా దర్శనం ఉంటుందని అహ్మద్ నగర్ జిల్లా కలెక్టర్ వెల్లడించారు. ప్రతిరోజు కేవలం 15 వేల మంది భక్తులకు మాత్రమే దర్శనం కల్పించనున్నామని ఆలయ బోర్డు తెలిపింది. అంతేగాకుండా.. తప్పనిసరిగా మాస్క్ ధరించడం, సోషల్ డిస్టెన్స్ పాటించాలని సూచించింది.
లాక్ డౌన్ సమయంలో…మూసివేయబడిన ఈ షిర్డీ ఆలయాన్ని గత సంవత్సరం నవంబర్ 16వ తేదీన తిరిగి తెరిచిన సంగతి తెలిసిందే. ‘దర్శన్’, ‘ఆర్తి’ కోసం ఆన్ లైన్ లో పాస్ లు పొందాలని ఆలయ నిర్వాహకులు తెలిపారు. పాస్ లను ఆలయ అధికారిక వెబ్ సైట్ నుంచి పొందవచ్చన్నారు.

మంగళవారం రాష్ట్రంలో 6 వేల కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య 51 వేల 857కు చేరుకున్నాయి. రాష్ట్రంలో 6 వేల 218 కొత్త కోవిడ్ కేసులు వెలుగు చూశాయి. సోమవారం 5 వేల 210గా ఉన్నాయి. మొత్తంగా..21 లక్షల 12 వేల 312 కు చేరుకున్నాయి. ఫిబ్రవరి 10వ తేదీ నుంచి కరోనా కేసులు ఎక్కువగా రికార్డవుతున్నాయి.

gurudatta

మహారాష్ట్రలో కొలువుదీరిన షిర్డీ సాయి ఆలయానికి దేశ, విదేశాల నుంచి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. సాయిని దర్శించుకుని తరిస్తారు. కొందరు మొక్కులు చెల్లించుకుంటారు. చాలామంది ముందుగానే షిర్టీ టూర్ ప్లాన్ చేసుకుంటారు. భక్తులతో షిర్డీ నిత్యం కిటకిటలాడుతూ ఉంటుంది. జన సమూహం ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం..సాయినాథుడిని రోజుకు కేవలం 15 వేల మందికి