వాస్తు ‘పిచ్చో’డు: లాటరీలో వచ్చిన కోట్ల ప్లాట్స్ వద్దన్నాడు 

  • Published By: veegamteam ,Published On : March 24, 2019 / 10:10 AM IST
వాస్తు ‘పిచ్చో’డు: లాటరీలో వచ్చిన కోట్ల ప్లాట్స్ వద్దన్నాడు 

ముంబై: అదృష్టం అందలం ఎక్కిస్తానంటే..బుద్ధి బురుదలోకి లాగిందనే సామెత  ఊరికనే పోలేదు. సమాజంలోని పోకడలను బట్టే సామెతలు పుడతాయి. సరిగ్గా ఈ సామెతకు తగిన వ్యక్తి గురించి వింటే మాత్రం..ఓరీ వీడి అసాథ్యం కూలా..అనుకోక మానరు. కాలం కలిసి వచ్చి..కోట్లు విలువ చేసే ఇల్లు (ప్లాటు)కాళ్ల దగ్గరకు  వచ్చినా ‘వాస్తు’ బాగాలేదు నాకొద్దంటు వదులుకన్నవాడిని ఏమంటాం..‘వాస్తు‘ పిచ్చోడు.
 

వాస్తును బలంగా నమ్మేవాళ్లు లాటరీలో తగిలిన కోట్ల విలువైన ఫ్లాట్‌ను వదులుకున్న వ్యక్తి మాత్రం బహుశా ఇతనొక్కడే అంటే అతిశయోక్తి కాదేమో. బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేష్‌కు శివసేన చీఫ్ అయిన వినోద్ షిర్కే అనే వ్యక్తికి మహారాష్ట్ర హౌజింగ్ అండ్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (ఎంహెచ్‌ఏడీఏ) నిర్వహించిన లాటరీలో రెండు ఖరీదైన ఫ్లాట్లు వచ్చాయి. 2018 డిసెంబర్‌లో ఈ ఫ్లాట్లను వినోద్ షిర్కే గెలుచుకున్నారు. ఇందులో ఒక ఫ్లాట్ రూ.4.99 కోట్లు, మరో ఫ్లాట్ రూ.5.8 కోట్లు విలువైనవి కావడం విశేషం. 

ఎంహెచ్‌ఏడీఏ చరిత్రలో అత్యంత ఖరీదైన లాటరీ ఫ్లాట్స్ ఇవే. వీటిలో ఖరీదైన రూ.5.8 కోట్లు విలువైన ఫ్లాట్‌నుక వాస్తు బాగాలేదనే కారణంతో వినోద్ వదులుకున్నారని బీఎంసీ అధికారి తెలిపారు. ఈ సందర్భంగా వినోద్ మాట్లాడుతు..ఎంహెచ్‌ఏడీఏ లాటరీలో రెండు ఫ్లాట్లు వచ్చాయనీ..కానీ మా వాస్తు వీటిలో కొన్ని మార్పులు చేస్తేనే నా రాజకీయ జీవితం బాగుంటుందని వాస్తు నిపుణులు చెప్పారనీ..కానీ ఖరీదైన ఫ్లాట్‌కు అటువంటి మార్పులు చేసేందుకు వీల్లేదనీ..అందుకే వాటిని వదులుకోవాల్సి వచ్చిందని తెలిపారు. వినోద్ వీటిని తీసుకోకపోవటంతో ఆ ఖరీదైన ఫ్లాట్ వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న మరో వ్యక్తికి ఎంహెచ్‌ఏడీఏ అధికారులు కేటాయించనున్నట్లు తెలిపారు.