మహా పీఠం మాదే : 170 మంది ఎమ్మెల్యేల మద్దతు – శివసేన

  • Published By: madhu ,Published On : November 3, 2019 / 09:50 AM IST
మహా పీఠం మాదే : 170 మంది ఎమ్మెల్యేల మద్దతు – శివసేన

మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేసేది శివసేన అని ఆ పార్టీ అధినేత ఉద్దవ్ థాక్రే సంచలన ప్రకటన చేశారు. బీజేపీ – శివసేన మధ్య విబేధాలు మరింత ముదురుతున్నాయి. నిన్న మొన్నటి వరకూ కాస్త పట్టూ విడుపుతో వ్యవహరించిన శివసేన ప్రస్తుతం పూర్తి భిన్నమైన స్వరం విన్పిస్తోంది. ఖచ్చితంగా మహారాష్ట్ర ప్రభుత్వం మాదేనంటూ కుండబద్ధలు కొడుతోంది. ఇతర పార్టీల నేతలతో వరస సమావేశాలు నిర్వహిస్తూ రాజకీయంగా కాక రగిలిస్తున్నారు.

ఆ పార్టీ నేత సంజయ్ రౌత్ తమకి ఏకంగా 170 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందంటూ ప్రకటించడం సంచలనం కలిగిస్తోంది. శివసేనకి ఉన్న 56మంది ఎమ్మెల్యేలకు అటు కాంగ్రెస్..ఎన్‌సిపిలను కలిపితే తప్ప ఈ సంఖ్య సాధ్యం కాదు. మరోవైపు నేషనలిస్ట్ కాంగ్రెస్ అధినేత శరద్‌పవార్‌ని కలిసిన తర్వాతే ఈ దూకుడు శివసేన పార్టీలో ఎక్కువైంది.. అక్కడ్నుంచి ఖచ్చితమైన హామీ లభించింది కాబట్టే ఈ రేంజ్‌లో సంఖ్యని కూడా ప్రకటించినట్లు తెలుస్తోంది. అటు ఎన్‌సీపీ కూడా శివసేన  తమతో టచ్‌లో ఉన్నట్లు చెప్తోంది. మరోవైపు బీజేపీ మాత్రం తన పాత భాగస్వామి శివసేనే దిగి వస్తుందని, తమతో తప్ప ఇంకొకరితో జట్టు కట్టి ప్రభుత్వం ఏర్పాటు చేయడం సాధ్యం కాదనే అభిప్రాయంలో ఉంది. మరి ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నారో రానున్న రోజుల్లో తేలనుంది. 
Read More : భారత్‌లో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: మోడీ