Surgical Strikes : చైనాపైనా సర్జికల్ స్ట్రైక్స్ చెయ్యండి – సేన ఎంపీ డిమాండ్

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగిపోతున్నాయి. సాధారణ పౌరులను టార్గెట్‌గా చేసుకొని రెచ్చిపోతున్నారు ఉగ్రవాదులు.

10TV Telugu News

Surgical Strikes : జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగిపోతున్నాయి. సాధారణ పౌరులను టార్గెట్‌గా చేసుకొని రెచ్చిపోతున్నారు ఉగ్రవాదులు. అయితే తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఇదే అంశంపై మాట్లాడాతూ.. పాకిస్తాన్ ఉగ్రవాద కార్యకలాపాలు ఆపకపోతే సర్జికల్ స్ట్రైక్స్ చేస్తామని హెచ్చరించారు.

చదవండి : Sanjay Raut : కాంట్రాక్ట్ కిల్లింగ్స్ స్థానంలో గవర్న్‌మెంట్ కిల్లింగ్స్..కేంద్రంపై సేన విమర్శలు

ఇక ఈ నేపథ్యంలోనే శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మీడియాతో మాట్లాడుతూ చైనాపై కూడా సర్జికల్ స్ట్రైక్స్ జరపాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాద దాడులపై ఆందోళన వ్యక్తం చేసిన ఆయన.. కేంద్రంపై విరుచుకుపడ్డారు. ఉగ్రవాదులు సామాన్య ప్రజలను టార్గెట్ చేసుకుంటున్నారని.. లడక్‌, కశ్మీర్‌లోని ప్రస్తుత పరిస్థితులపై హోంమంత్రి అమిత్‌షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ దేశానికి చెప్పాలని డిమాండ్‌ చేశారు.

చదవండి : Sanjay Raut : అప్ఘాన్ పరిస్థితులను భారత విభజనతో పోల్చిన శివసేన..గాంధీకి బదులు జిన్నాని చంపి ఉంటే..

జమ్మూకశ్మీర్‌లో పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు. అక్కడ ఉన్న మైనారిటీలను టార్గెట్ గా చేసుకొని హత్యలకు పాల్పడుతున్నారని అన్నారు. పాక్ విషయంలో తరచూ సర్జికల్ స్ట్రైక్స్ గురించి మాట్లాడుతారని, ఇప్పుడు చైనాపై కూడా చేయాలన్నారు సంజయ్. ఆదివారం రాత్రి బిహార్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులను ఉగ్రవాదులు కాల్చి చంపిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కుల్గాం జిల్లాలోని వాన్‌పో ప్రాంతంలో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఇద్దరు కార్మికులు మృతి చెందగా.. మరో కార్మికుడికి తీవ్ర గాయాలవగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇక ఉగ్రవాదుల దుశ్చర్య వలన 13 రోజుల్లో 15 మంది ప్రాణాలు విడిచారు.