MP Sanjay Raut : ‘తల తెగి పడినా తల వంచేదేలేదు..వచ్చి అరెస్ట్ చేసుకోండి’

మహారాష్ట్ర రాజకీయాలు గంగ గంటకు అత్యంత ఉత్కంఠభరితంగా కొనసాగుతున్నాయి. అటు శివసేన రెబెల్ నేత ఏక్‌నాథ్‌ షిండే వర్గం, ఇటు సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే వర్గం ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. ఈక్రమంలో శివసేన ఎంపీ సంజయ్‌రౌత్‌కు ED సమన్లు జారీ చేయడం సంచలనం రేపుతోంది.

MP Sanjay Raut : ‘తల తెగి పడినా తల వంచేదేలేదు..వచ్చి అరెస్ట్ చేసుకోండి’

Shiv Sena Mp Sanjay Raut

Shiv Sena MP Sanjay Raut: మహారాష్ట్ర రాజకీయాలు గంగ గంటకు అత్యంత ఉత్కంఠభరితంగా కొనసాగుతున్నాయి. అటు శివసేన రెబెల్ నేత ఏక్‌నాథ్‌ షిండే వర్గం, ఇటు సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే వర్గం ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. ఈక్రమంలో శివసేన ఎంపీ సంజయ్‌రౌత్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) సమన్లు జారీ చేయడం సంచలనం రేపుతోంది. పత్రాచల్‌ భూ కుంభకోణం కేసులో రేపు విచారణకు రావాలని సంజయ్‌రౌత్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. ఈడీ జారీ చేసిన సమన్లపై ఎంపీ సంజయ్ రౌత్ స్పందిస్తూ..ఈడీ నోటీసులు ఇచ్చినా తాను ఏమాత్రం భయపడేది లేదని..తల తెగి పడినా తల వంచేదే లేదని కావాలంటే వచ్చి తనను అరెస్ట్ చేసుకోవాలంటూ సవాల్ విసరారు.

తాము బాల్‌థాక్రే సిద్దాంతాలను అమలు చేసేవారమని..అసలు సిసలైన శివసేన నేతలమని తమ అరెస్ట్‌ చేసినా భయపడేది లేదన్నారు. తమ పోరాటాన్ని ఆపేందుకు కుట్ర జరుగుతోందని అన్న రౌత్ ఈడీ సమన్లు కుట్రపూరితమైనవని ఆరోపించారు. మరోపక్క సంజయ్‌రౌత్‌కు ఈడీ సమన్లు జారీ చేయడంపై కాంగ్రెస్‌ మండిపడింది. బీజేపీ చేతిలో కీలుబొమ్మగా మారిన ఈడీ రౌత్‌కు సమన్లు జారీ చేసిందని ఆరోపించింది.

Also read : MP Sanjay Raut : శివ‌సేన ఎంపీ సంజ‌య్ రౌత్‌ ఈడీ షాక్..రూ.1034 కోట్ల ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ..

గతంలో ప్రవీణ్ రౌత్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. ప్రవీణ్ రౌత్ సంజయ్ రౌత్‌కు సన్నిహితుడు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఇటీవల ప్రవీణ్ రౌత్‌కు చెందిన కోట్ల విలువైన ఆస్తులను కూడా జప్తు చేసింది. 11 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఇందులో పాల్ఘర్‌లో ప్రవీణ్ రౌత్‌కు సంబంధించిన ఆస్తి దాదాపు 9 కోట్లు. దాదర్‌లోని ఫ్లాట్‌, 2 కోట్ల విలువైన అలీబాగ్‌లోని ప్లాట్‌ సంజయ్‌ రౌత్‌ భార్యకు సంబంధించినవని ఆరోపణలు వచ్చాయి.

2020 డిసెంబర్‌లో పీఎంసీ బ్యాంకు కుంభకోణం కేసులో విచారణ సందర్భంగా గతంలో ప్రవీణ్ పేరు వచ్చింది. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ భార్య వర్షకు ప్రవీణ్ రౌత్ భార్య మాధురి 2010లో ముంబైలోని దాదర్‌లో ఫ్లాట్‌ను కొనుగోలు చేసేందుకు రూ.55 లక్షల వడ్డీ లేని రుణం ఇచ్చినట్లు దర్యాప్తు సంస్థకు తెలిసింది. ఈ డబ్బు ఎక్కడిది అని ఈడీ ఆరా తీస్తోంది.

Also read :  MP Sanjay Raut : శివ‌సేన ఎంపీ సంజ‌య్ రౌత్‌ ఈడీ షాక్..రూ.1034 కోట్ల ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ..