Sanjay Raut : నేడు ఈడీ ముందు హాజరు కానున్న సంజయ్ రౌత్

శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఈరోజు మధ్యాహ్నం ముంబైలోని ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు ముందు హాజరవుతారు.

Sanjay Raut : నేడు ఈడీ ముందు హాజరు కానున్న సంజయ్ రౌత్

Sanjay Raut

Sanjay Raut : శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఈరోజు మధ్యాహ్నం ముంబైలోని ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు ముందు హాజరవుతారు. పాత్రాచాల్ భూ కుంభకోణం కేసులో సంజయ్ రౌత్ ను ఈడీ అధికారులు  ప్రశ్నించనున్నారు. తనను ఈడీ అధికారులు ఈరోజు విచారిస్తున్నందున శివసేన కార్యకర్తలు ఎవరూ ఈడీ కార్యాలయం వద్దకు రావద్దన్ని సంజయ్ రౌత్   విజ్ఞప్తి చేశారు.   ఈడీ విచారణ చేయటం అనేది పూర్తిగా రాజకీయమే అని.. ఇది అందరికీ తెలిసిన విషయమే అని సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. దర్యాప్తు సంస్ధ పిలిచింది కాబట్టి ఎంపీగా.. ఒక పౌరుడిగా హజరవుతున్నానని ఆయన అన్నారు.

శివసేన తిరుగుబాటు నాయకుడు ఏక్‌నాథ్ షిండే ప్రమాణ స్వీకారంతో మహారాష్ట్రలో రాజకీయ తుపాను సద్దుమణిగింది. ఈడీకి భయపడి శివసేన ఎమ్మెల్యేలు తిరుగుబాటుకు పాల్పడ్డారని శివసేన ఆరోపిస్తోంది.  మహారాష్ట్రలో కొలువైన కొత్త ప్రభుత్వానికి సంజయ్ రౌత్ అభినందనలు తెలిపారు. ఉధ్దవ్ ఠాక్రే ప్రభుత్వం  ఏర్పడినప్పటి నుంచి డిస్టర్బ్ చేస్తామని మొదటి నుంచి చెప్పారని వారు చెప్పినట్లే చేశారని ఆయన  విమర్శించారు. కానీ మేము అలా చేయం… మేము ఈ ప్రభుత్వానికి భంగం కలిగించమని…. వారు ప్రజల  కోసం పనిచేయాలని సంజయ్ రౌత్ కోరారు. ప్రస్తుత పరిస్ధితులతో శివసేన బలహీనపడిందని అనుకోనని ఆయన అన్నారు.