Maharashtra Politics : ‘మహా’ రాజకీయం.. రాజ్ ఠాక్రేతో ఫోన్‌లో ఏక్ నాథ్ షిండే మంతనాలు!

ఇప్పటికే అఘాడీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్న షిండే వర్గం.. MNSలో తమ చీలిక వర్గాన్ని విలీనం చేయనున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించే ఇరువురు నేతలు చర్చలు జరిపినట్టు తెలుస్తోంది.

Maharashtra Politics : ‘మహా’ రాజకీయం.. రాజ్ ఠాక్రేతో ఫోన్‌లో ఏక్ నాథ్ షిండే మంతనాలు!

Eknath

Maharashtra politics : మహారాష్ట్రలో రాజకీయం క్షణక్షణం మారిపోతోంది. శివసేన రెబల్‌ నేత ఏక్ నాథ్ షిండే, మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన అధినేత రాజ్ ఠాక్రేతో అనూహ్యంగా రెండుసార్లు ఫోన్‌లో మాట్లాడారు. మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల గురించి వీరిద్దరు చర్చించారు. అయితే రాజ్ ఠాక్రే ఆరోగ్య పరిస్థితి గురించి షిండే ఆరా తీసినట్టు బయటకు ప్రకటన వచ్చినా.. చర్చలు మాత్రం వేరే విషయాలపై జరిగినట్టు సమాచారం.

ఇప్పటికే అఘాడీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్న షిండే వర్గం.. MNSలో తమ చీలిక వర్గాన్ని విలీనం చేయనున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించే ఇరువురు నేతలు చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. రెబల్ నేతలంతా శివసేన పార్టీ గుర్తును, సింబల్‌ను తీసుకునేందుకు ప్రయత్నించినా… సాంకేతిక అంశాల కారణంగా అది ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది.

Governor Koshyari: కేంద్ర బలగాల్ని సిద్ధంగా ఉంచండి.. కేంద్రానికి మహారాష్ట్ర గవర్నర్ లేఖ

దీంతో షిండే బీజేపీలో విలీనం చేయాలన్న ఆలోచన కూడా చేశారు. అలా చేస్తే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని సందిగ్ధంలో పడ్డారు. దీంతో రాజ్‌ఠాక్రేకు చెందిన నవనిర్మాణ్ సేన పార్టీలో చేరితే బాగుంటుందనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.