ఆవుల సంరక్షణ కోసం “కౌ కేబినెట్”…దేశంలోనే తొలిసారిగా మధ్యప్రదేశ్ లో

10TV Telugu News

Shivraj Chouhan Announces “Cow Cabinet” In Madhya Pradesh రాష్ట్రంలోని ఆవుల సంరక్షణ కోసం ప్రత్యేకంగా ‘కౌ కేబినెట్‌’ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు బుధవారం(నవంబర్-18,2020)మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. ఈ కౌ కేబినెట్ లో పశుసంవర్ధకశాఖ, అటవీ, పంచాయతీ, గ్రామీణాభివృద్ధి, రెవెన్యూ, గృహ, రైతు సంక్షేమ శాఖలను చేర్చామని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఓ ట్వీట్ చేశారు.కౌ కేబినెట్ మొట్టమొదటి సమావేశం ఈ నెల 22న గోపాష్టమి సందర్భంగా అగర్ మాల్వాలోని ఆవుల అభయారణ్యంలో నిర్వహించనున్నట్లు సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. కాగా,ఈ ఏడాది ఆరంభంలో రాష్ట్రంలోని ప్రభుత్వ ఆధ్వర్యంలోని షెల్టర్‌లలోని 1.8 లక్షల ఆవుల దాణా కోసం మధ్యప్రదేశ్ సర్కార్ 11 కోట్ల రూపాయలు కేటాయించిన విషయం తెలిసిందే.2017లో మధ్యప్రదేశ్ లో 2017లో దేశంలోనే తొలిసారి ఆవుల అభయారణ్యాన్ని బీజేపీ సర్కార్ ప్రారంభించింది. భోపాల్ నగరానికి 190 కిలోమీటర్ల దూరంలో అగర్ మాల్వాలో రూ.32 కోట్లతో 472 హెక్టార్లలో కామధేను గోవుల అభయారణ్యం ఏర్పాటు చేశారు. అయితే ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో దానిని ప్రైవేటు పరం చేశారు.

10TV Telugu News