Gold Price : బంగారం ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన ధరలు

కాలంతో పని లేదు. పండుగలతో నిమిత్తం లేదు. సీజన్ ఏదైనా మన దేశంలో బంగారానికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఇక పెళ్లిళ్ల సీజ‌న్‌లో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పసిడి ధరలు చుక్కలను తాకుతాయి.

Gold Price : బంగారం ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన ధరలు

Gold Price

Gold Price : కాలంతో పని లేదు. పండుగలతో నిమిత్తం లేదు. సీజన్ ఏదైనా మన దేశంలో బంగారానికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఇక పెళ్లిళ్ల సీజ‌న్‌లో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పసిడి ధరలు చుక్కలను తాకుతాయి. పసిడి ధరల్లో రోజురోజుకు ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. ఒక రోజు తగ్గితే.. మరో రోజు పెరుగుతాయి.

తాజాగా బంగారం ప్రియులకు షాక్ తగిలింది. కొన్ని రోజుల నుంచి తగ్గుతూ వస్తున్న పసిడి ధరలు సోమవారం(సెప్టెంబర్ 6,2021) ఒక్కసారి భారీగా పెరిగాయి. నేడు ఒక్కరోజే రూ.350 పైగా ధర పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా మన దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. ల్లీ బులియన్ జువెలరీ మార్కెట్లో 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం ధర రూ.47,208 నుంచి రూ.47,573 పైకి చేరింది. ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల బంగారం ధర ఒక్కరోజులో రూ.300 పైన పెరిగి రూ.44,402 దగ్గర నిలిచింది.

Nipah virus : ఈ పండు తిన‌డం వ‌ల్లే కేరళలో ఆ బాలుడికి నిపా వైర‌స్ వ‌చ్చిందా?

హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు స్థిరంగానే ఉన్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నేడు రూ.44,510గా ఉంటే, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,560గా ఉంది.

వెండి ధర కూడా బంగారం బాటలోనే పయనించింది. నేడు కేజీ వెండి ధర సుమారు రూ.2వేలు పెరిగి కిలో రూ.65,116కు చేరింది. అంతకుముందు రోజు కిలో రూ.63వేల 158గా ఉన్న సంగతి తెలిసిందే.

బంగారం, వెండి ధరలపై… ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల దగ్గరున్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు వంటి వివిధ అంశాలు ప్రభావం చూపుతాయి.

Vijay Sethupathi: ఇకపై కృతిశెట్టితో కలిసి నటించడం నా వల్ల కాదు

ప్రపంచంలోనే అత్యంత విలువైనది బంగారం. పుత్తడిని కొనుగోలు చేయడానికి చాలా మంది ఇష్టపడతారు. ఇక భారతీయులకు అత్యంత ఇష్టమైనది బంగారం. మహిళలు బంగారానికి అత్యధికంగా ప్రాధాన్యత ఇస్తుంటారు. ధర ఎంత పెరిగినా భారతీయులు బంగారం కొనుగోళ్లు మాత్రం ఆపరు.

బంగారం ధరలు హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలున్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల దగ్గరున్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు వెల్లడిస్తున్నారు.