కరెంటు బిల్లు చూసి ఆత్మహత్య చేసుకున్నాడు

  • Edited By: madhu , August 11, 2020 / 07:15 AM IST
కరెంటు బిల్లు చూసి ఆత్మహత్య చేసుకున్నాడు

కరెంటు బిల్లులు చూసి షాక్ తింటున్నారు జనాలు. వేలు..లక్షల సంఖ్యలో బిల్లులు వస్తున్న ఘటనలు చూస్తునే ఉన్నాం. కానీ..కరెంటు బిల్లు చూసి..అంత కట్టలేనని భావించి తీవ్ర మనస్థాపానికి గురై…ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో చోటు చేసుకుంది.లీలాధర్ లక్ష్మణ్ గైధానీ ఇంటికి మూడు నెలల కాలానికి రూ. 40 వేల కరెంటు బిల్లును పంపించారు. ఆ కాలంలో లాక్ డౌన్ కొనసాగిన సంగతి తెలిసిందే. ఈ బిల్లును చూడగానే..లక్ష్మణ్ గుండెల్లో దడ పుట్టింది. తనకు ఇంత బిల్లు రావడానికి గల కారణాలు తెలుసుకొనేందుకు ప్రయత్నించాడు.కానీ అధికారులు అంతగా రెస్పాండ్ ఇవ్వలేదని సమాచారం. దీంతో రూ. 40 వేలు కట్టాల్సిందేనా ? అని తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో ఫుల్ గా మందు కొట్టాడు. మత్తులో ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడని, ఆసుపత్రికి తీసుకెళ్లగా..అప్పటికే చనిపోయాడని కుటుంబసభ్యులు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. అతని వద్ద ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదన్నారు.