Drug Addict Stabs : ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. డ్రగ్స్ మానేయమని చెప్పిన మేనమామను పొడిచి పొడిచి చంపేశాడు

అల్లుడితో డ్రగ్స్ మాన్పించేందుకు మేనమామ చేసిన ప్రయత్నం అతడి ప్రాణమే తీసింది. మత్తు పదార్ధాలకు బానిస అయిన అతడు.. మేనమామను కత్తితో పొడిచి పొడిచి చంపేశాడు.

Drug Addict Stabs : ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. డ్రగ్స్ మానేయమని చెప్పిన మేనమామను పొడిచి పొడిచి చంపేశాడు

Drug Addict Stabs : ఈ రోజుల్లో మంచి చెప్పడమే పాపమైపోతోంది. నాలుగు మంచి మాటలు చెప్పినా, నాలుగు మంచి విషయాలు చెప్పినా.. పట్టించుకునే వారు లేకుండా పోయారు. పైగా మంచి చెప్పిన వాడిని శత్రువులా చూస్తున్నారు. నువ్వెవడు నాకు చెప్పడానికి అంటూ కోపంతో ఊగిపోతున్నారు. క్షణికావేశంలో ప్రాణాలే తీసేస్తున్నారు. ఇలాంటి షాకింగ్ ఘటన ఒకటి.. పంజాబ్ అమృత్ సర్ లో జరిగింది. అల్లుడితో డ్రగ్స్ మాన్పించేందుకు మేనమామ చేసిన ప్రయత్నం అతడి ప్రాణమే తీసింది. మత్తు పదార్ధాలకు బానిస అయిన మేనల్లుడు.. మేనమామను కత్తితో పొడిచి పొడిచి చంపేశాడు.

అమృత్ సర్ లో ఈ షాకింగ్ ఘటన జరిగింది. రయ్యా సమీపంలోని గగ్గర్బనా గ్రామానికి చెందిన యువకుడు గుర్బిందర్ సింగ్ అలియాస్ గోపీ డ్రగ్స్ కు బానిసయ్యాడు. అతడితో డ్రగ్స్ మాన్పించేందుకు కుటుంబసభ్యులు ఎన్నో ప్రయత్నాలు చేశారు. అయినా ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలో ఆదివారం ఘోరం జరిగింది. డ్రగ్స్ కు బానిస అయిన ఆ యువకుడు.. తన మేనమామ నరైందర్ సింగ్ ను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. కత్తితో పొడిచి పొడిచి చంపేశాడు. ఇదంతా సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యింది.

Also Read..Wife Killed Husband : వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం.. భర్తకు విషం కలిపిన అన్నం ఇచ్చి చంపిన భార్య

గుర్బిందర్ సింగ్.. ఉదయం 8 గంటల సమయంలో తన మేనమామ నరైందర్ సింగ్ ఇంటికి వచ్చాడు. ఇంటి గేటు తీసిన నరైందర్ సింగ్.. తన మేనల్లుడిని లోనికి రావాలని చెప్పి వెనక్కి తిరిగి ఇంట్లోకి వెళ్లబోతున్నాడు. ఇంతలో వెనుక నుంచి వచ్చిన గుర్బిందర్ సింగ్.. సడెన్ గా తన వెంట తెచ్చుకున్న కత్తితో మేనమామ మీద అటాక్ చేశాడు.

కత్తితో పలు మార్లు విచక్షణారహితంగా పొడిచాడు. దాడి చేస్తున్నా.. నరైందర్ సింగ్.. బెదరలేదు. అల్లుడిని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. తీవ్రంగా ప్రతిఘటించాడు. అయితే ప్రయోజనం లేకపోయింది. గుర్బిందర్ సింగ్ దాడిని ఆపలేదు. దీంతో నరైందర్ సింగ్ గట్టిగా కేకలు వేశాడు. ఇంతలో అరుపులు విన్న నరైందర్ సింగ్ కుటుంబసభ్యులు కంగారుగా పరిగెత్తుకుని వచ్చారు.

Also Read.. Fake Baba Arrest : నగ్నంగా ఫోటోలు దిగితే ధనవంతులు అయిపోతారు..! పాతబస్తీలో గలీజు బాబా అరెస్ట్

కానీ, ఈలోపే దారుణం జరిగింది. కత్తి దాడిలో నరైందర్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు. రక్తం బాగా పోవడంతో అతడు చనిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మేనమామను హత్య చేసిన అల్లుడు గుర్బిందర్ సింగ్ పరారీలో ఉన్నాడు. అతడిని పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

మత్తుపదార్ధాలకు దూరంగా ఉండాలని నరైందర్ సింగ్.. పదే పదే తన మేనల్లుడికి చెబుతుండే వాడు. గుర్బిందర్ సింగ్ డ్రగ్స్ తీసుకోకుండా అనేకసార్లు నరైందర్ సింగ్ అడ్డుపడ్డాడు. దీంతో తన మేనమామ మీద కక్ష పెంచుకున్న అల్లుడు.. అతి కిరాతకంగా హత్య చేశాడు.