Viral Video : షాకింగ్.. భార్యను ఎత్తుకుని రైలు పట్టాలపైకి దూకేసిన భర్త.. ఆ తర్వాత ఏం జరిగిందంటే

Viral Video : రైలు వచ్చే సమయానికి భార్యను ఎత్తుకుని పట్టాలపైకి దూకేశాడు. ఇది గమనించిన సిబ్బంది..

Viral Video : షాకింగ్.. భార్యను ఎత్తుకుని రైలు పట్టాలపైకి దూకేసిన భర్త.. ఆ తర్వాత ఏం జరిగిందంటే

Viral Video (Photo : Google)

Viral Video – Metro Train : అదో మెట్రో రైల్వే స్టేషన్. రైలు కోసం ప్రయాణికులు ఎదురుచూస్తున్నారు. ప్లాట్ ఫామ్ పై కొందరు నిల్చుని ఉన్నారు. ఇంతలో ఓ రైలు వచ్చింది. రైలు రావడం గమనించిన ఓ వ్యక్తి వెంటనే తన భార్యను ఎత్తుకుని పట్టాలపైకి దూకేశాడు. దీంతో అక్కడున్న వారంతా షాక్ కి గురయ్యారు.

మెట్రో పట్టాలపై దూకి ఓ జంట ఆత్మహత్యకు ప్రయత్నించడం తీవ్ర కలకలం రేపింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కోల్ కతా మెట్రో స్టేషన్ లో ఈ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.

Also Read..Hyderabad : హయత్‌నగర్ వృద్ధురాలి మర్డర్ కేసుని 24గంటల్లోనే ఛేదించిన పోలీసులు.. చంపింది ఎవరో, ఎందుకో తెలుసా

కోల్ కతా మెట్రో నార్త్ – సౌత్ లైన్ లో.. రైలు వచ్చే సమయానికి భార్యను ఎత్తుకుని పట్టాలపైకి దూకేశాడు. ఇది గమనించిన మెట్రో రైలు సిబ్బంది.. ఆ జంటను కాపాడారు. ఈ ఘటనతో కాసేపు మెట్రో సేవలకు అంతరాయం ఏర్పడింది. అయితే, మెట్రో స్టేషన్లలోనూ నిఘా పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఈ షాకింగ్ ఘటన జూన్ 3న నోఅపారా మెట్రో స్టేషన్ లో సాయంత్రం 6.34 గంటలకు జరిగింది. ఆత్మహత్య చేసుకునేందుకు ఆ జంట ఈ పని చేసింది. అయితే, అదృష్టవశాత్తు వారికి ఏమీ కాలేదు. దాంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. కాగా, ఈ ఘటనను కళ్లారా చూసిన తోటి ప్రయాణికులు షాక్ కి గురయ్యారు. భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు.