Tata Nexon EV Fire : బాబోయ్.. ఎలక్ట్రిక్ కారులోనూ మంటలు.. ఇంతకీ ఈవీ సేఫేనా?

ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు మొగ్గుచూపుతున్న వాహనదారులకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. గత కొన్ని రోజులుగా ఎలక్ట్రిక్ బైక్ లు వరుసగా మంటల్లో కాలిపోతున్నాయి. వాటి బ్యాటరీలు బాంబుల్లా పేలిపోతున్నాయి. తాజాగా ఎలక్ట్రిక్ కారు కూడా..

Tata Nexon EV Fire : బాబోయ్.. ఎలక్ట్రిక్ కారులోనూ మంటలు.. ఇంతకీ ఈవీ సేఫేనా?

Tata Nexon Ev Fire

Tata Nexon EV Fire : పెట్రోల్, డీజీల్ ధరలు చుక్కలను తాకుతున్నాయి. రోజురోజుకి ఇంధన ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ధరల పోటుతో వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే పెరుగుతూపోతే తమ పరిస్థితి ఏంటని వాహనదారులు వాపోతున్నారు. ఇంత భారం తాము మోయలేము అంటున్నారు. ఈ క్రమంలో వాహనదారుల చూపు ఇంధనమే అవసరం లేని ప్రత్యామ్నాయ వాహనాలపై పడింది.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

అందులోనూ ముఖ్యంగా అందరి దృష్టి ఎలక్ట్రిక్ వాహనాలపైకి మళ్లింది. ఎలక్ట్రిక్ వాహనాలకు పెట్రోల్ తో కానీ డీజిల్ తో కానీ పనే లేదు. పైగా ఖర్చు కూడా తగ్గుతుంది. దీంతో వాహనదారులు ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసేందుకు మొగ్గుచూపుతున్నారు. క్రమంగా వాటికి ఆదరణ కూడా పెరుగుతోంది. దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల సేల్స్ కూడా పెరుగుతున్నాయి.

ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు మొగ్గుచూపుతున్న వాహనదారులకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. గత కొన్ని రోజులుగా ఎలక్ట్రిక్ బైక్ లు వరుసగా మంటల్లో కాలిపోతున్నాయి. వాటి బ్యాటరీలు బాంబుల్లా పేలిపోతున్నాయి. తాజాగా ఎలక్ట్రిక్ కారు కూడా మంటల్లో కాలిపోవడం కలకలం రేపింది. ముంబైలో ఈ ఘటన జరిగింది. ముంబైలోని వసై ప్రాంతంలో ఓ రెస్టారెంట్ ముందు నిలిపిన నెక్సాన్ ఈవీలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. భారత్ లో అత్యధికంగా అమ్ముడుపోయే కార్లలో టాటా నెక్సాన్ ఈవీ ముందువరుసలో ఉంటాయి. టాటా గ్రూప్ కంపెనీ టాటా మోటార్స్ కి చెందిన నెక్సాన్ ఈవీ కారు.. మంటల్లో కాలిపోవడం టెన్షన్ పెట్టిస్తోంది.(Tata Nexon EV Fire)

EV Fires : పేలుతున్న ఈవీ బ్యాటరీలు.. దేశీయంగా బ్యాటరీల ఉత్పత్తియే బెటర్.. నీతి ఆయోగ్

నెక్సాన్ ఈవీ కారులో మంటలు చెలరేగడం టాటా మోటార్స్ ను సైతం షాక్ కి గురి చేసింది. కారులో మంటలు చెలరేగడానికి కారణం ఏంటో అన్నది తెలుకునేందుకు టాటా మోటర్స్ దర్యాఫ్తు చేస్తోంది. కారులో ఏ లోపం వల్ల మంటలు వచ్చాయన్న దానిపై లోతైన దర్యాఫ్తు చేస్తున్నామని టాటా మోటర్స్ ప్రకటించింది. తాము వాహనాలు, వాహనదారుల భద్రతకు కట్టుబడి ఉన్నామని తెలిపింది. నాలుగేళ్లలో 30వేల కంటే ఎక్కువ ఈవీలు రోడ్లపైకి వచ్చాయని, ఈవీలు వంద మిలియన్ కిలోమీటర్లకు పైగా ప్రయాణించిన తర్వాత ఇదే మొదటి ఘటన అని కంపెనీ పేర్కొంది. విచారణ పూర్తయిన తర్వాత ప్రమాదానికి గల కారణాలు ఏంటో వెల్లడిస్తామని తెలిపింది.

Nitin Gadkari : EV కంపెనీలకు మంత్రి గడ్కరీ హెచ్చరిక.. భద్రత లోపిస్తే భారీ మూల్యం తప్పదు..!

ఇటీవల కాలంలో అనేక టెస్లా కార్లు అగ్నికి ఆహుతయ్యాయి. భారత్ విషయానికి వస్తే ఓలా, ప్యూర్ ఈవీ సహా పలు కంపెనీల ద్విచక్ర వాహనాలు మంటల్లో కాలిపోయాయి. బ్యాటరీ నాణ్యత విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం ప్రమాదానికి కారణం అని నిపుణులు చెబుతున్నారు. అయితే, నెక్సాన్ ఈవీ కారు కాలిపోవడానికి ఇంకా కారణాలు తెలియలేదు. వరుసగా ఎలక్ట్రిక్ వెహికల్స్ లో మంటలు చెలరేగడం వినియోగదారులను కలవరపెడుతోంది. ఎలక్ట్రిక్ వెహికల్స్ లో ప్రయాణించాలంటేనే భయపడే పరిస్థితి తలెత్తింది.