Bridge Collapse : OMG.. ఒక్కసారిగా కుప్పకూలిన కేబుల్ బ్రిడ్జి.. వీడియో వైరల్

Bridge Collapse : వంతెన కూలుతుండగా అక్కడే ఉన్న కొందరు స్థానికులు.. వీడియో తీశారు. వంతెన కూలుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Bridge Collapse : OMG.. ఒక్కసారిగా కుప్పకూలిన కేబుల్ బ్రిడ్జి.. వీడియో వైరల్

Bridge Collapse

Bridge Collapse – Viral Video : అదో కేబుల్ బ్రిడ్జి. ఇంకా నిర్మాణ దశలో ఉంది. అయితే, ఒక్కసారిగా కేబుల్ బ్రిడ్జి కూలిపోయింది. ఈ షాకింగ్ ఘటన బీహార్ లో చోటు చేసుకుంది. భగల్ పూర్ లో గంగానదిపై కేబుల్ బ్రిడ్జి నిర్మిస్తున్నారు. అగువాణి-సుల్తాన్ గంజ్ కేబుల్ వంతెన ఉన్నట్లుండి కుప్పకూలింది. ఖగారియా, భగల్ పూర్ మధ్య రాకపోకల కోసం ఈ వంతెన నిర్మిస్తున్నారు.

Also Read..Kavach : కవచ్ ఉన్నా.. ప్రమాదం జరిగేదా? అసలు ఏంటీ కవచ్? రైలు ప్రమాదాలను ఎలా అరికడుతుంది?

కాగా, ఈ వంతెన కూలిపోవడం ఇది రెండోసారి కావడం గమనార్హం. వంతెన కూలుతుండగా అక్కడే ఉన్న కొందరు స్థానికులు.. వీడియో తీశారు. వంతెన కూలుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.(Bridge Collapse)

వంతెన కూలిన వ్యవహారం పొలిటికల్ యాంగిల్ తీసుకుంది. ప్రతిపక్షాలు అధికారపక్షాన్ని టార్గెట్ చేశాయి. కేబుల్ బ్రిడ్జి ప్రాజెక్ట్ సీఎం నితీశ్ కుమార్ డ్రీమ్ ప్రాజెక్ట్ అని, అలాంటిది రెండోసారి కుప్పకూలిపోయిందని, ప్రజలకు చెందిన రూ.1750 కోట్ల సొమ్ము జల సమాధి అయ్యిందని బీజేపీ నేతలు ఆరోపించారు. ఇకనైనా ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మారాలని, ఇతర రాష్ట్రాల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం మాని, తన సొంత రాష్ట్రంపైన మాత్రమే దృష్టి పెట్టాలని బీజేపీ నేతలు సూచించారు.

రూ.1710 కోట్ల రూపాయల వ్యయంతో గంగా నదిపై ఈ తీగల వంతెనను నిర్మిస్తున్నారు. ఖగారియా, భగల్ పూర్ జిల్లాలను కలిపేందుకు ఈ వంతెన నిర్మాణం చేస్తున్నారు. అయితే, నిర్మాణ దశలోనే రెండుసార్లు వంతెన కూలిపోవడం స్థానికులను భయాందోళనకు గురి చేస్తోంది.

Vizianagaram : కూతురిని హీరోయిన్ చేయాలని, ఆ భాగాలు త్వరగా ఎదగాలని హార్మోన్ ఇంజెక్షన్లు.. కసాయి తల్లి అరెస్ట్

క్లాసిక్ కేబుల్-స్టేడ్, కాంటిలివర్-గర్డర్ రకాల మధ్య హైబ్రిడ్ పద్ధతిలో ఈ వంతెనను నిర్మిస్తున్నారు. వంతెన అమాంతం కూలిపోవడం కళ్లారా చూసిన స్థానికులు షాక్ కి గురయ్యరు. బిహార్ రాజ్య పుల్ నిర్మాణ్ నిగమ్ లిమిటెడ్ కోసం ఎస్పీ సైనలా నిర్మాణం ద్వారా నిర్మించిన వంతెన “నిర్మాణంలో తప్పుగా నిర్వహించడం, డిజైన్ లోపం” కారణంగా ధ్వంసం కావడం ఇది రెండవసారి. దీనిపై జేడీయూ ఎమ్మెల్యే స్పందించారు. నవంబర్ లేదా డిసెంబర్ లో వంతెను ప్రారంభించాలని అనుకున్నట్లు చెప్పారు. అయితే దురదృష్టవశాత్తు వంతెక కూలిపోయిందన్నారు. ఈ ఘటనపై కచ్చితంగా విచారణ జరిపించాల్సిదేని డిమాండ్ చేశారు.