Twist In Marriage : పెళ్లిలో ఊహించని ట్విస్ట్.. ఫేషియల్‌కు వెళ్లి వరుడు, అతడి తమ్ముడితో వధువుకు వివాహం

ఓ పెళ్లిలో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. వధువు పెళ్లి అంతకుముందు నిశ్చయించిన వరుడితో జరగలేదు. అతడి తమ్ముడితో వధువుకు వివాహం జరిగింది. ఏంటి షాక్ అయ్యారా. కానీ, ఇది నిజం. అసలేం జరిగిందంటే..

Twist In Marriage : పెళ్లిలో ఊహించని ట్విస్ట్.. ఫేషియల్‌కు వెళ్లి వరుడు, అతడి తమ్ముడితో వధువుకు వివాహం

Twist In Marriage : ఓ పెళ్లిలో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. వధువు పెళ్లి అంతకుముందు నిశ్చయించిన వరుడితో జరగలేదు. అతడి తమ్ముడితో వధువుకు వివాహం జరిగింది. ఏంటి షాక్ అయ్యారా. కానీ, ఇది నిజం. అసలేం జరిగిందంటే..

ఫేషియల్ కు వెళ్లిన వరుడు పరారీ కావడంతో.. వధువుకు అతడి తమ్ముడితో పెళ్లి చేసేశారు. ఈ వింత ఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. బరేలీకి చెందిన తిలక్ అనే వ్యక్తికి పెళ్లి ఖాయమైంది. అయితే, అతడికి ఈ పెళ్లి ఇష్టం లేదు. ఈ విషయాన్ని అతడు ఇంట్లో చెప్పలేదు. దాంతో వాళ్లు ముహూర్తాలు పెట్టేశారు. సరిగ్గా తాళి కట్టే సమయానికి వరుడు.. ఫేషియల్ చేయించుకునేందుకు బయటకు వెళ్లాడు. అంతే, ఆ తర్వాత తిరిగి రాలేదు. ఇష్టం లేని పెళ్లి చేస్తుండటంతో అతడు పరార్ అయ్యాడు.

కాసేపట్లో పెళ్లి అనగా.. వరుడు పరార్ అని తెలిసి అంతా షాక్ అయ్యారు. వరుడు, వధువు కుటుంబసభ్యులు అయోమయంలో పడిపోయారు. ఏం చేయాలో వారికి అర్థం కాలేదు. పెళ్లి కొడుకు తిరిగి వస్తాడేమో అని వాళ్లు చాలా సేపు ఎదురుచూశారు. కానీ, ప్రయోజనం లేకపోయింది. అతడు తిరిగి రాలేదు.

దీంతో ఇరు కుటుంబాలకు చెందిన వారు మాట్లాడుకున్నారు. ఏం చేయాలా అని చర్చించారు. ఆ తర్వాత ఇరువురూ ఓ నిర్ణయానికి వచ్చారు. వరుడు తిలక్ తమ్ముడికి వధువుని ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించారు. దీనికి అందరూ ఆమోదం తెలిపారు. అంతే, కేవలం రెండు గంటల్లోనే పెళ్లి చేశారు. చివరి నిమిషంలో వరుడు జంప్ అయినా పెళ్లి ఆగలేదు. దీంతో వధువు కుటుంబసభ్యులు ఆనందంగా ఫీల్ అయ్యారు. కాగా, ఈ పెళ్లి వ్యవహారం నెట్టింట వైరల్ గా మారింది.

ఈ విచిత్రమైన పెళ్లి.. ఫిలిభిత్‌లోని బిల్సందా పోలీస్ స్టేషన్‌ పరిధిలో జరిగింది. పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేశారు. వివాహానికి అందరూ వచ్చేశారు. కాసేపట్లో పెళ్లి కూతురు మెడలో వరుడు తాళి కట్టాల్సి ఉంది. సరిగ్గా.. ఆ సమయంలోనే ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ పెళ్లి వరుడికి ఎంతమాత్రమూ ఇష్టం లేదు. కానీ, ఇంట్లో ఈ విషయాన్ని చెప్పలేకపోయాడు. ఎలాగైనా పెళ్లి జరక్కుండా చూసుకునేందుకు అతడు ప్లాన్ చేశాడు.

ఇందుకోసం ఫేషియల్ డ్రామా ఆడాడు. ఫేషియల్ కోసం బయటకు వెళ్తున్నా అని చెప్పి అక్కడి నుంచి అటే చెక్కేశాడు. ఫేషియల్ కి వెళ్లిన వరుడు ముహూర్తం సమయం అయినా రాకపోవడంతో ఇరు కుటుంబాలకు చెందిన వారికి అనుమాన వచ్చింది. వరుడు తిరిగి వస్తాడేమో అని చాలాసేపు ఎదురుచూశారు. కానీ, అతడు రాలేదు. దీంతో వరుడి తమ్ముడిపై అందరి చూపు పడింది. అతడిని పెళ్లి కొడుకుగా చేయాలని భావించి వరుడు, వధువు కుటుంబ సభ్యులు చర్చించారు. అమ్మాయిని, అబ్బాయిని అడిగారు. తమకు ఈ పెళ్లి ఇష్టమే అని వారిద్దరూ చెప్పారు. అంతే, వరుడు తమ్ముడితో వధువుకు తాళి కట్టించేశారు.