Man Fall From Train : తృటిలో బతికిపోయాడు.. కదిలే రైలు ఎక్కబోతూ జారిపడిన ప్రయాణికుడు, వీడియో వైరల్

రన్నింగ్ రైలు ఎక్కబోతూ ఓ వ్యక్తి ప్రాణాలను ప్రమాదంలోకి పడేసుకున్న ఘటన ఒకటి మహారాష్ట్రలోని అకోలా రైల్వే స్టేషన్ లో చోటు చేసుకుంది. అతడి అదృష్టం బాగుంది.. తృటిలో బతికిపోయాడు. లేదంటే.. రైలు చక్రాల కింద నలిగిపోయి ఉండాల్సింది.

Man Fall From Train : తృటిలో బతికిపోయాడు.. కదిలే రైలు ఎక్కబోతూ జారిపడిన ప్రయాణికుడు, వీడియో వైరల్

Man Fall From Train : ప్రయాణికుల పొరపాట్లు, తొందరపాటు, నిర్లక్ష్యం కారణంగా రైల్వే స్టేషన్లలో ప్రమాదాలు కామన్ గా మారాయి. దేశంలో ఏదో ఒక ప్రాంతంలో రైల్వే స్టేషన్ లో ప్రమాద ఘటనలు తరుచుగా జరుగుతూనే ఉన్నాయి. కదిలే రైలు ఎక్కే ప్రయత్నంలో, దిగే సమయంలో ప్రయాణికులు పట్టు తప్పి ప్రమాదశాత్తు జారిపడిపోతున్నారు.

కొన్ని సందర్భాల్లో తృటిలో ప్రమాదం నుంచి బయటపడుతుంటే, మరికొన్ని సందర్భాల్లో రైలు చక్రాల కింద పడి చనిపోతున్నారు. ఈ తరహా ప్రమాదాలు ఇటీవలి కాలంలో ఎక్కువ కావడం ఆందోళన కలిగించే అంశం. కదిలే రైలు ఎక్కే ప్రయత్నం లేదా దిగే ప్రయత్నం చేయొద్దని, అది ప్రమాదకరం అని, ప్రాణాంతకం అని రైల్వే అధికారులు పదే పదే చెబుతున్నా.. ఇంకా కొందరిలో మార్పు రాకపోవడం బాధాకరం.

Also Read..Lady With Phone On Railway Track : నీ ఫోన్ పిచ్చి పాడుగాను.. రైలు కింద పడ్డా ఫోన్ మాట్లాడటం మాత్రం ఆపలేదు.. షాకింగ్ వీడియో

తాజాగా రన్నింగ్ రైలు ఎక్కబోతూ ఓ వ్యక్తి ప్రాణాలను ప్రమాదంలోకి పడేసుకున్న ఘటన ఒకటి మహారాష్ట్రలోని అకోలా రైల్వే స్టేషన్ లో చోటు చేసుకుంది. అయితే, అతడి అదృష్టం బాగుంది.. తృటిలో బతికిపోయాడు. లేదంటే.. రైలు చక్రాల కింద నలిగిపోయి ఉండాల్సింది.

Also Read..Bihar Train Incident : చాలా చాలా లక్కీ.. చావు జస్ట్ మిస్.. పైనుంచి వెళ్లిన రైలు, అయినా బతికిపోయాడు

అకోలా రైల్వే స్టేషన్ లో.. ఓ వ్యక్తి.. కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో పట్టు తప్పింది. అంతే, రైలు, ప్లాట్ ఫామ్ మధ్య పడిపోయాడు. ఇది గమనించిన పోలీసులు వెంటనే స్పందించారు. రైలు కింద పడబోతున్న ఆ ప్రయాణికుడిని రక్షించారు. ఈ ఘటనలో ఒక్కసారిగా అక్కడ కలకలం రేగింది. తోటి ప్రయాణికులు, ప్లాట్ ఫామ్ పై ఉన్న ప్రయాణికులు కంగారుపడ్డారు. అయితే, ఆ వ్యక్తి క్షేమంగా బయటపడటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also Read..TTE Electric Shock : బాబోయ్.. రైల్వే స్టేషన్‌లో ఊహించని ప్రమాదం, మాట్లాడుతుండగానే కరెంట్ షాక్.. వీడియో వైరల్

కాగా, కదులుతున్న రైలు నుంచి దిగడం లేదా కదులున్న రైలు ఎక్కడం వంటివి ఎప్పుడూ ప్రమాదమే. ఏ మాత్రం తేడా జరిగినా ప్రాణాలు పోవడం ఖాయం. అందుకే ఇలాంటి పనులు చేయొద్దని అధికారులు నెత్తీనోరు బాదుకుని చెబుతూనే ఉన్నారు. అయినా, కొందరిలో మార్పు రావడం లేదు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.