Professor Collapses On Stage : షాకింగ్ వీడియో.. మాట్లాడుతూనే కుప్పకూలిన ప్రొఫెసర్, గుండెపోటుతో మృతి

ఇటీవలి కాలంలో సడెన్ గా గుండెపోటుతో మరణించే వారి సంఖ్య పెరిగింది. అప్పటివరకు ఉత్సహంగా, యాక్టివ్ గా కనిపించిన వారు సడెన్ గా కుప్పకూలిపోతున్నారు. గుండెపోటుతో ప్రాణాలు వదులుతున్నారు.

Professor Collapses On Stage : షాకింగ్ వీడియో.. మాట్లాడుతూనే కుప్పకూలిన ప్రొఫెసర్, గుండెపోటుతో మృతి

Professor Collapses On Stage : ఇటీవలి కాలంలో సడెన్ గా గుండెపోటుతో మరణించే వారి సంఖ్య పెరిగింది. అప్పటివరకు ఉత్సహంగా, యాక్టివ్ గా కనిపించిన వారు సడెన్ గా కుప్పకూలిపోతున్నారు. గుండెపోటుతో ప్రాణాలు వదులుతున్నారు.

తాజాగా బీహార్‌లోని చాప్రా జిల్లాలో అలాంటి షాకింగ్ ఘటన ఒకటి జరిగింది. అప్పటివరకు ఉత్సాహంగా ఓ వేదికపై మాట్లాడిన ప్రొఫెసర్‌ హఠాత్తుగా కుప్పకూలిపోయాడు. గుండెపోటుతో ఆయన మరణించాడు. మతపరమైన కార్యక్రమంలో పాల్గొన్న రిటైర్డ్ ప్రొఫెసర్ వేదికపై కుప్పకూలి గుండెపోటుతో మరణించారు.

ప్రొఫెసర్ రణంజయ్ సింగ్, మతపరమైన కార్యక్రమం జరిగిన మారుతీ మానస్ దేవాలయానికి ప్రధాన కార్యదర్శిగా కూడా ఉన్నారు. ఓ మతపరమైన కార్యక్రమానికి హాజరైన రిటైర్ట్ ప్రొఫెసర్ వేదికపై మాట్లాడుతూనే కుప్పకూలిపోయాడు. గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

రణంజయ్‌ సింగ్ వేదికపై మాట్లాడుతుండగానే కుప్పకూలిపోయారు. వెంటనే ఆయనను ఆస్పత్రి తరలించినప్పటికీ అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు డాక్టర్లు వెల్లడించారు. గుండెపోటు రావటంతోనే మరణించినట్లు తెలిపారు.

కాగా, అప్పటివరకు ఆరోగ్యంగా కనిపిస్తూనే ఒక్కసారిగా కుప్పకూలిపోయి ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు ఇటీవల పెరిగిపోయాయి. వయసుతో సంబంధం లేకుండా గుండెపోటుతో మరణిస్తుండటం ఆందోళనకు గురిచేస్తోంది. అసలేం జరిగిందో తెలుసుకునే లోపే మరణిస్తున్నారు. ఈ క్రమంలో ఆరోగ్యం గురించి చాలా జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు.