బ్రేకింగ్ న్యూస్ : షూటింగ్ లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..మార్గదర్శకాలు ఇవే

  • Published By: madhu ,Published On : August 23, 2020 / 12:28 PM IST
బ్రేకింగ్ న్యూస్ : షూటింగ్ లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..మార్గదర్శకాలు ఇవే

కరోనా నేపథ్యంలో ఆగిపోయిన షూటింగ్ లు ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతాయా ? అని ఎదురు చూస్తున్న వారికి కేంద్రం గుడ్ న్యూస్ వినిపించింది. టీవీ, సినిమా షూటింగ్ లకు ప్రారంభించుకోవచ్చని, కానీ కొన్ని షరతులు పాటించాలని వెల్లడించింది.

ఈ మేరకు 2020, ఆగస్టు 23వ తేదీ ఆదివారం మార్గదర్శకాలను జారీ చేసింది. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా షూటింగ్ లు చేసుకోవాలని I&B Minister ప్రకాష్ జవదేకర్ ప్రకటించారు.
షూటింగ్ సమయంలో ప్రతొక్కరూ మాస్క్ లు ధరించాలి.

ఖచ్చితంగా సోషల్ డిస్టెన్స్ పాటించాలి.
నటీ నటులంతా కంపల్సరీగా ఆరోగ్య సేతు యాప్ ఉపయోగించాల్సిందే.
మేకప్ సిబ్బంది పీపీఈ కిట్లు ధరించాలి.
షూటింగ్ ప్రదేశాలకు ప్రేక్షకులను అనుమతించవద్దు.

ప్రపంచ వ్యాప్తంగా వ్యాపిస్తున్న కరోనా వైరస్ భారతదేశంలో ప్రభావం చూపిస్తోంది. దీని కారణంగా టీవీ, సినిమా షూటింగ్ లతో పాటు ఎన్నో రద్దయ్యాయి. మార్చి నెల నుంచి నటీ నటులు, షూటింగ్ సిబ్బంది అందరూ ఇంట్లోనే ఉండిపోయారు. దీనివల్ల సినీ పరిశ్రమకు ఎంతో నష్టం వాటిల్లింది.

వీరిని ఆదుకోవడానికి పలువురు ప్రముఖులు ముందుకొచ్చి…వారిని చేతనైన ఆర్థిక సహాయం, నిత్యావసర సరుకులు అందించారు. తాజాగా నిబంధనలతో కూడిన షూటింగ్ చేసుకోవచ్చని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ చేసిన ప్రకటనతో సినీ వర్గాలు సంతోషం వ్యక్తం చేశాయి.


నిబంధనలు పాటిస్తూ..షూటింగ్ లు చేసుకోవాలని చెప్పారు. షూటింగ్ లకు అనుమతినిస్తూ..ప్రకటించడం సంతోషంగా ఉందని మంత్రి జవదేకర్ చెప్పారు.