70 ఏండ్ల తర్వాత..ఆ గ్రామానికి కరెంటు వచ్చింది..ఎక్కడో తెలుసా

  • Published By: madhu ,Published On : July 24, 2020 / 07:57 AM IST
70 ఏండ్ల తర్వాత..ఆ గ్రామానికి కరెంటు వచ్చింది..ఎక్కడో తెలుసా

స్వతంత్రం వచ్చి 70 ఏండ్లు కావొస్తోంది. అప్పటి నుంచి కరెంటు లేక చీకట్లో మగ్గిన ఆ గ్రామ ప్రజలు ప్రస్తుతం ఫుల్ ఖుష్ అవుతున్నారు. కొన్ని ఏళ్ల తర్వాత..బల్బు జిగేల్ చూసి ఎంతో ఆనంద పడుతున్నారు. స్విచ్చాన్ చేయడంతో బల్బు వెలుగులతో తమ ఇళ్లు ఉండడం చూసిన గ్రామస్తులు అధికారులకు థాంక్స్ చెబుతున్నారు.

భారతదేశంలోని దక్షిణ కాశ్మీర్ షోపియాన్, దున్నడి గ్రామానికి 2020, జులై 23వ తేదీన కరెంటు సౌకర్యం కల్పించారు. మారుమూల ప్రాంతమైన దున్నడి విలేజ్ లో గత 70 ఏళ్లుగా కరెంటు లేదు. కానీ..విద్యుత్ శాఖ, జిల్లా యంత్రాంగం నిరంతర కృషి కారణంగా..కరెంటు సౌకర్యం వచ్చింది. కరెంటు రావడంతో..బల్బుల కింద..తమ పిల్లలు కూర్చొని హాయిగా చదుకోగలరని తల్లిదండ్రులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇక కొవ్వొత్తులు, ఆయిల్ దీపాల పని ఉండదని అంటున్నారు. బల్బులు ఏర్పాటు చేసి స్విచ్చాన్ చేయడంతో ఆ వెలుగుకు చిన్నారులు, పెద్దలు ఆనందంలో మునిగిపోయారు.
2017 సంవత్సరంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించిన కేంద్ర పథకం Pradhan Mantri Sahaj Bijli Har Ghar Yojanaను గ్రామంలో అమలు చేశారు.

ఈ ప్రాంతంలో ఐదు ట్రాన్స్ ఫార్మర్లను ఏర్పాటు చేసి ఏడు రోజుల్లో పనులు పూర్తి చేసి గ్రామానికి విద్యుత్ సౌకర్యం కల్పించారు. ఈ మారుమూల ప్రాంతానికి కరెంటు సౌకర్యం కల్పించాలనే ఉద్దేశ్యంతో వేగంగా పనులు పూర్తి చేయడం జరిగిందని ఓ విద్యుత్ శాఖ అధికారి వెల్లడించారు.

స్వతంత్రం వచ్చి ఏళ్లు అవుతున్నాయి. కాలం గడిచిపోతోంది. కానీ..కొంతమంది ప్రజలకు అందాల్సిన కొన్ని మౌలిక సదుపాయలు ఇప్పటి వరకు అందడం లేదు. కరెంటు, రోడ్లు, నీళ్లు అందని గ్రామాలు ఇంకా భారతదేశంలో ఉన్నాయంటే ఆశ్చర్యపోవాల్సిందే. ఆహారం, పోషణ, ఆరోగ్యం, విద్య, వంటి ప్రాథమిక అవసరాలు కొంతమంది జనాభాకు అందని ద్రాక్షగానే మిగిలిపోతోంది.