Bihar Parle G : పార్లే-జీ బిస్కెట్ల కోసం జనాల పరుగులు..ఎందుకో తెలుసా ?

సెంటిమెంట్ గా రావడంతో..ప్రజలు నమ్మారు. ఇది నిజమా ? పుకారా ? అని ఆలోచించకుండా...దుకాణాల వైపుకు పరుగులు తీశారు. సీతామర్హి జిల్లాలో పార్లేజీ బిసెట్ల నిల్వలు అయిపోయాయి.

Bihar Parle G : పార్లే-జీ బిస్కెట్ల కోసం జనాల పరుగులు..ఎందుకో తెలుసా ?

Bihar Parle G

Parle-G On Jitiya : పార్లే జీ బిస్కెట్ ఉందా ? అయ్యే లేదా ? అంటూ మరో దుకాణానికి పరుగులు. అక్కడ అదే సమాధానం నో స్టాక్. ఇప్పుడెలా చేయాలి..అంటూ దూర ప్రాంతమైనా..దుకాణాలకు జనాలు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. పార్లే జీ బిస్కెట్ చేతులో పడితే ఎవరెస్టు శిఖరం ఎక్కిన ఫీల్ కనబరుస్తున్నారు. దీనికంతటికి కారణం ఒక్క పుకారు. ఆ ఒక్క పుకారు..పార్లే జీ బిస్కెట్ సేల్స్ అమాంతం పెరిగిపోయాయి. పోటీ పడి కొనుగోలు చేయడంతో దుకాణాల ఎదుట నో స్టాక్ బోర్డు పెట్టాల్సి వచ్చింది. ఈ ఘటన బీహార్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

Read More : Spinach : పాలకూర వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో తెలుసా!..

పార్లేజీ..అంటే పేదోడి బిస్కెట్. ఎందుకంటే తక్కువ ధరకు ఇది దొరుకుతుంది. మార్కెట్ లోకి రకరకాల బిస్కెట్స్ రావడంతో..వీటిని తక్కువ కొంటున్నారు. దీంతో ఆ కంపెనీ సేల్స్ పడిపోతున్నాయి. ఈ క్రమంలో…బీహార్ రాష్ట్రంలో.. సీతామర్హి జిల్లాలో అనూహ్యంగా వీటికి డిమాండ్ ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో జితియా వ్రతం జరుపుకుంటుంటారు. దీనినే జీవిత్ పుత్రికా వ్రత్ అని కూడా అంటారు. సెప్టెంబర్ 28వ తేదీ నుంచి 30వ తేదీ వరకు మూడు రోజుల పాటు పండుగ నిర్వహించుకుంటుంటారు. ఈ పండుగ రోజున తల్లులు ఉపవాసం ఉంటారు. కనీసం మంచినీళ్లు కూడా ముట్టుకోరు. తమ బిడ్డలు దీర్ఘాయువుతో ఉండాలని..సుఖసంతోషాలతో జీవించాలని దేవుడిక పూజలు చేస్తారు. ఇది ప్రతి సంవత్సరం చేస్తుంటారు.

Read More :Huzurabad : హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఖరారు

ఇంతవరకు బాగానే ఉంది. కానీ..అనూహ్యంగా..పిల్లలకు కీడు జరగకుండా ఉండాలంటే..పార్లే జీ బిస్కెట్లు తినాలనే పుకారు విపరీతంగా వ్యాపించింది. సెంటిమెంట్ గా రావడంతో..ప్రజలు నమ్మారు. ఇది నిజమా ? పుకారా ? అని ఆలోచించకుండా…దుకాణాల వైపుకు పరుగులు తీశారు. సీతామర్హి జిల్లాలో పార్లేజీ బిసెట్ల నిల్వలు అయిపోయాయి. ఇదే క్యాష్ చేసుకోవాలని కొంతమంది దుకాణదారులు ప్రయత్నించారు. ఎక్కువ రేటుకు ప్యాకెట్లను విక్రయించారు. పుకారు ఎవరు సృషించారో తెలియదు కానీ..పార్లే జీ కంపెనీ సేల్స్ అమాంతం పెరిగిపోయాయి. కొన్ని దుకాణాల్లో నో స్టాక్ బోర్డులు పెట్టాల్సి వచ్చింది. బిడ్డలకు మంచి జరుగుతుందని కొంతమంది అంటుంటే…దీనిని మరికొంతమంది తప్పుబట్టారు.