Cow Dung: నవ్వాలా.. ఏడవాలా.. ఆవు పేడతో కొవిడ్ తగ్గుతుందా – అఖిలేశ్ యాదవ్

ఆవుపేడతో కొవిడ్ వైరస్ తగ్గుతుందా... ఇది చూసి నవ్వాలో.. ఏడవాలో అర్థం కావడం లేదని సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ అంటున్నారు. కొవిడ్-19ను ఎదుర్కొనేందుకు ఆవు పేడ. గో మూత్రంతో కలిపి ఒంటికి పూసుకున్న వ్యక్తుల వీడియోపై ఇలా స్పందించారు.

Cow Dung: నవ్వాలా.. ఏడవాలా.. ఆవు పేడతో కొవిడ్ తగ్గుతుందా – అఖిలేశ్ యాదవ్

Cow Dung

Cow Dung: ఆవుపేడతో కొవిడ్ వైరస్ తగ్గుతుందా… ఇది చూసి నవ్వాలో.. ఏడవాలో అర్థం కావడం లేదని సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ అంటున్నారు. కొవిడ్-19ను ఎదుర్కొనేందుకు ఆవు పేడ. గో మూత్రంతో కలిపి ఒంటికి పూసుకున్న వ్యక్తుల వీడియోపై ఇలా స్పందించారు.

యాదవ్ ట్వీట్ చేస్తూ.. ‘దీని గురించి నేను నవ్వాలా.. ఏడవాలా.. ‘ అని అన్నారు. ఈ ట్వీట్ కు అటాచ్ చేస్తూ.. శ్రీ స్వామినారాయణ్ గురుకుల్ విశ్వవిద్య ప్రతిష్ఠానం స్కూల్ కు సంబంధించిన వీడియో పోస్టు చేశారు. అందులో డజను మంది చొక్కాల్లేకుండా బకెట్లలో ఆవు పేడను నింపుకుని ముందు పెట్టుకుని కూర్చున్నారు.

బకెట్లలో చేతులు పెట్టి తలతో సహా ఒంటి నిండా పేడ పూసుకుంటున్నారు. అలా చేసిన తర్వాత సర్కిల్ లో నిలబడి ప్రార్థన చేస్తారట.

‘డాక్టర్లు కూడా ఇక్కడకు వస్తున్నారు. ఈ థెరఫీ అనేది వారిలో ఇమ్యూనిటీని పెంచుతుందని వారి నమ్మకం’ అని గౌతం మణిలాల్ బోరిసా అనే వ్యక్తి అంటున్నారు. అలా చేయడం వల్లనే గతేడాది కొవిడ్-19 నుంచి రికవరీ అయ్యాయని నమ్ముతున్నారు.

ఇప్పటికే డాక్టర్లు, సైంటిస్టుల తప్పుడు వార్తలు విని సెక్యూరిటీ లేకుండా ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకోవద్దని సూచిస్తున్నారు. ఆవు పేడ, మూత్రంతో కొవిడ్ పై పోరాడేందుకు ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుందని ఎటువంటి సైన్స్ పరమైన సాక్ష్యాల్లేవని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హెడ్ డా. జేఏ జయాలాల్ అంటున్నారు.