మాంసాహారాన్ని కడగాల్సిందేనా..? ఐసీఎంఆర్‌ క్లారిటీ!

  • Published By: vamsi ,Published On : June 9, 2020 / 04:09 AM IST
మాంసాహారాన్ని కడగాల్సిందేనా..? ఐసీఎంఆర్‌ క్లారిటీ!

కరోనా విస్తరించడం మొదలు పెట్టిన కొత్తల్లో చికెన్, మటన్ విషయంలో అనేక పుకార్లు వ్యాపించిన సంగతి తెలిసిందే. అయితే తర్వాతి కాలంలో ఆ పుకార్లకు పలువురు చెక్ పెట్టడంతో చికెన్, మటన్ అమ్మకాలు పెరిగాయి. దీంతో రేట్లు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. కరోనా వ్యాప్తి పెరిగిపోగా.. మాంసం తినాలా వద్దా? తింటే ఏమైనా సమస్యలు ఉన్నాయా? అనే విషయాలపై మరోసారి చర్చ జరుగుతుంది. 

ఈ క్రమంలో హైదరాబాద్‌ జాతీయ పోషకాహార సంస్థ ఇదే విషయమై కీలక ప్రకటన చేసింది. మాంసం ఆరోగ్యానికి మంచిదని, కాకపోతే మాంసం కొన్నాక ఉప్పుతో కడిగి వండుకొని తినాలని సూచనలు చేసింది. పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, పప్పు దినుసులు, చిరుధాన్యాలే కాకుండా.. మటన్‌, చికెన్‌, చేపలు వంటి మాంసాహారం తీసుకుంటే శరీరానికి చాలా మంచిదని స్పష్టం చేసింది. 

ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రిసెర్చ్‌(ఐసీఎంఆర్‌), నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌(ఎన్‌ఐఎన్‌) సంస్థకు చెందిన ఇద్దరు సీనియర్‌ సైంటిస్టులు మాంసాహార వినియోగంపై మాట్లాడుతూ.. మటన్‌, చికెన్‌, చేపలు తినడం ద్వారా కండరాల పటుత్వంతో పాటు ఎముకలు బలంగా ఉంటాయని, మెదడు చురుగ్గా పనిచేస్తుందని వెల్లడించారు. 

కరోనా వైరస్‌ పెరిగిపోతుండగా.. మటన్‌, చికెన్‌, చేపలను ఉప్పు నీటితో శుభ్రంగా కడగాలని, కొవిడ్‌-19 నిబంధనలు పాటిస్తూ నిర్వహిస్తున్న దుకాణాల నుంచి మాత్రమే మాంసం కొనుగోలు చేయాలని వివరించారు. వండిన తర్వాత బ్యాక్టీరియా చనిపోయే అవకాశం ఉన్నందున సందేహం లేకుండా మాంసం తినొచ్చని చెప్పారు. 

మాములుగానే కడగడం వల్ల బ్యాక్టీరియాను తొలగించడానికి ఉపయోగకరమైన మార్గం. ఉదాహరణకు, రోజంతా నిర్మించే బ్యాక్టీరియాను వదిలించుకోవడానికి క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవడం మంచిది. ఈ సలహా కొన్ని ఆహారాలకు కూడా వర్తిస్తుంది, ఉదాహరణకు, తాజా ఉత్పత్తులు. పండ్లు లేదా కూరగాయలు వంటి ఆహారాలు వాటి ఉపరితలంపై ధూళి మరియు బ్యాక్టీరియాను కలిగి ఉండవచ్చు.

Read: కరోనా తర్వాత రెస్టారెంట్లలో ఎలా ఉండబోతుంది..