Love Jihad: అవసరమైతే ‘లవ్ జిహాద్’కు వ్యతిరేకంగా కొత్త చట్టం: శివరాజ్ సింగ్ చౌహాన్

మధ్య ప్రదేశ్‌లో ‘లవ్ జిహాద్’కు వ్యతిరేకంగా కొత్త చట్టం తీసుకొస్తామని ప్రకటించారు ఆ రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్. ఇటీవల శ్రద్ధా వాకర్ హత్య నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Love Jihad: అవసరమైతే ‘లవ్ జిహాద్’కు వ్యతిరేకంగా కొత్త చట్టం: శివరాజ్ సింగ్ చౌహాన్

Love Jihad: మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో అవసరమైతే ‘లవ్ జిహాద్’కు వ్యతిరేకంగా కొత్త చట్టం తీసుకొస్తామని చెప్పారు ఆ రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్. మధ్య ప్రదేశ్‌లో ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇటీవల జరిగిన శ్రద్ధా వాకర్ హత్య గురించి ప్రస్తావించారు.

PM Modi: అహ్మదాబాద్‌లో ఓటు వేసిన ప్రధాని మోదీ.. హోం మంత్రి అమిత్ షా కూడా అక్కడే

ఈ ఘటన నేపథ్యంలో రాష్ట్రంలో ‘లవ్ జిహాద్’ను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తామన్నారు. ‘‘రాష్ట్రంలో ఏ ఆడబిడ్డను 35 ముక్కలుగా నరికే పరిస్థితి రానివ్వం. ‘లవ్ జిహాద్’కు వ్యతిరేకంగా కొత్త చట్టం రూపొందిస్తాం. లవ్ జిహాద్ వంటి ఘటనలు జరగకుండా చూసుకుంటాం. గిరిజన ఆడబిడ్డలను భూముల కోసం పెళ్లి చేసుకోవడాన్ని కూడా నిరోధిస్తాం. ఇది లవ్ కాదు.. లవ్ పేరుతో సాగుతున్న జిహాద్. మధ్ర ప్రదేశ్ నేలపై ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని అంగీకరించం’’ అని శివరాజ్ సింగ్ అన్నారు. మరోవైపు రాష్ట్రంలో యునిఫామ్ సివిల్ కోడ్ అమలు చేసేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. దేశవ్యాప్తంగా యునిఫామ్ సివిల్ కోడ్ అమలు చేయాలని ఆయన సూచించారు.

ఇప్పటికే మధ్య ప్రదేశ్ ప్రభుత్వం ఈ దిశగా కసరత్తు చేస్తోంది. రాజ్యాంగంలోని 44వ అధికరణం ప్రకారం దీన్ని అమలు చేస్తారు. ఈ చట్టం ప్రకారం కులాలు, మతాలు, ప్రాంతాలు, లింగ బేధాలకు అతీతంగా అందరికీ ఒకే చట్టం అమలవుతుంది.