దేశంలోనే తొలిసారి..ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న మహిళా ఎస్ఐ

దేశంలోనే తొలిసారి..ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న మహిళా ఎస్ఐ

Man Paints 2.5 Km Road With Love Message (4)

first female officer to be part of encounter : మహిళలు ఎన్నో రంగాల్లో ప్రతిభ చాటుతున్నారు. సైన్యం కూడా వీరోచిత పోరాటాలు చేస్తున్నారు. కానీ దేశంలోనే మొట్టమొదటిసారి ఓ మహిళా ఎస్ఐ ఎన్‌కౌంటరులో పాల్గొన్న ఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. అన్నిరంగాల్లో దూసుకుపోతున్న మహిళలు పోలీస్ డిపార్ట్ మెంట్ లో తమదైన ముద్ర వేసుకుంటున్నారు. కానీ ఇప్పటి వరకూ భారత చరిత్రలో ఎన్ కౌంటర్ లో పాల్గొన్న సందర్భాలు లేవు.కానీ ఇప్పుడా కొరత కూడా తీరిపోయింది. ఓ మహిళా ఎస్సై ఎన్ కౌంటర్ లో పాల్గొన్నారు. ఆమే ప్రియాంక.

2008వ సంవత్సరంలో ఢిల్లీ పోలీసు క్రైంబ్రాంచ్ లో ఎస్ఐగా చేరిన ప్రియాంక ప్రగతి మైదానంలో జరిగిన ఎన్‌కౌంటరులో పాల్గొని, ఎన్‌కౌంటరులో పాల్గొన్న మహిళా ఎస్ఐగా పేరు పొందారు. ఈ విషయాన్ని స్వయంగా ఢిల్లీ అదనపు పోలీసు కమిషనర్ శిబేష్ సింగ్ తెలిపారు. ఈ ఎన్‌కౌంటరు అనంతరం గ్యాంగ్ స్టర్ రోహిత్ చౌదరి, అతని సహచరుడు పర్వీన్ అలియాస్ టిటును మహిళా ఎస్ఐ ప్రియాంక అరెస్టు చేశారు.

ఈ ఎన్‌కౌంటరులో రోహిత్ చౌదరి, టిటూల కాళ్లకు గాయాలవడంతో వారిని ఆర్ఎంఎల్ ఆసుపత్రికి తరలించామని మహిళా ఎస్ఐ ప్రియాంక తెలిపారు. ఎన్‌కౌంటరులో గ్యాంగ్ స్టర్లు మహిళా ఎస్ఐ ప్రియాంకపై కాల్పులు జరపగా.. ఆ బుల్లెట్లు ప్రియాంక వేసుకున్న బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ కు తగిలాయి. దీంతో ఆమెకు ఎటువంటి హాని జరగలేదు. కాగా..ఎన్‌కౌంటరులో పాల్గొన్న మహిళా ఎస్ఐ ప్రియాంకను ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు. మహిళా ఎస్ఐ ప్రియాంక అరెస్టు చేసిన గ్యాంగ్ స్టర్లకు రూ.5లక్షల రివార్డు ఉందని పోలీసులు తెలిపారు.