Karnataka CM : సోనియా చక్రం .. సిద్దరామయ్యకే పట్టం

గత 45 ఏళ్లలో ఐదేళ్లు సీఎంగా పనిచేసిన ఒకే ఒక్కడు సిద్ధరామయ్యనే సీఎంగా ఎంపిక చేసింది హస్తం పార్టీ అధిష్టానం. ఈ ఎంపికలో సోనియాగాంధీయే ప్రధాన పాత్ర వహించారు. సోనియా సిద్ధరామయ్య పేరును ఖరారు చేయటంలో కీలక పాత్ర వహించారు.రంగంలోకి రాహుల్ దిగినా సోనియాయే చక్రం తిప్పారు.

Karnataka CM : సోనియా చక్రం .. సిద్దరామయ్యకే పట్టం

Karnataka CM Siddaramaiah

Karnataka CM Siddaramaiah : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక సీఎం ఎవరు అనేదానిపై ఎట్టకేలకు ఉత్కంఠ వీడింది. కాంగ్రెస్ అధిష్టానం సీనియారిటీకే పట్టం కట్టింది. ఓ పక్క మాస్ ఫాలోయింగ్..మరోపక్క క్లీన్ ఇమేజ్ కలిగిన నేత సిద్ధరామయ్యనే సీఎంగా ప్రకటించింది. దీంతో గత 45 ఏళ్లలో ఐదేళ్లు సీఎంగా పనిచేసిన ఒకే ఒక్కడు సిద్ధరామయ్యనే సీఎంగా ఎంపిక చేసింది హస్తం పార్టీ అధిష్టానం. ఈ ఎంపికలో సోనియాగాంధీయే ప్రధాన పాత్ర వహించారు. సోనియా సిద్ధరామయ్య పేరును ఖరారు చేయటంలో కీలక పాత్ర వహించారు.రంగంలోకి రాహుల్ దిగినా సోనియాయే చక్రం తిప్పారని తెలుస్తోంది. ఈ క్రమంలో శివకుమార్ వర్గీయులు సీఎంగా శివకుమార్ నే ప్రకటించాలని నినాదాలు చేసినా పట్టించుకోలేదు. ఆచి తూచి వ్యవహరించి ఎవరికి చెప్పేలా వారికి నచ్చ చెప్పి సిద్దయ్యకు పట్టం కట్టేలా వ్యూహరచన చేశారు సోనియాగాంధీ.

సిద్దరామయ్యకు పట్టకడుతునే మరోపక్క డీకే శివకుమార్ కు చెప్పాల్సిన విధంగా సోనియా నచ్చచెప్పినట్లుగా తెలుస్తోంది. విధేయతకు, త్యాగాలకు గుర్తింపు ఎప్పటికీ ఉంటుందని డీకేశికి నచ్చ చెప్పారు. మీకు తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారట. అలాగే ఇచ్చిన వాగ్ధానాలు నెరవేర్చాలని సిద్ధరామయ్యకు సూచించారు.

శివకుమార్ నే సీఎంగా ప్రకటించాలని శివకుమార్ వర్గీయులు సోనియా గాంధీ నివాసనం వద్ద నినాదాలు చేస్తు డిమాండ్ చేశారు. కానీ సోనియా మాత్రం సిద్ధరామయ్యకే పట్టం కట్టారు.అలా సీఎం ఎంపికల చక్రం తిప్పిన సోనియా సిద్ధరామయ్యను సీఎంగా ఎంపిక చేశారు. ఈ ఎంపిక వెనుకాల 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఒక్క అవినీతి ఆరోపణ లేకుండా సిద్ధరామయ్య ఉండటం కూడా కారణంగా కనిపిస్తోంది. అలాగే మాస్ ఫాలోయింగ్ ఉన్న సిద్దయ్యకు ఈ ఎన్నికల్లో 135 ఎమ్మెల్యేలు గెలుపొందగా వారిలో 90మంది ఎమ్మెల్యేల మద్దతు సిద్ధరామయ్యకే ఉన్నట్లు అధిష్టానం నిర్వహించిన రహస్య ఓటింగ్ లో స్పష్టం కావటం కూడా మరోకారణం అనుకోవచ్చు.

అంతేకాదు అవినీతి రహిత పాలన సాగించారన్న పేరుంది. మాస్ లీడర్ గానూ సిద్దరామయ్యకు పేరుంది. అంతేకాక, సిద్ధరామయ్య అయితే రాబోయే కాలంలో పార్టీలో వర్గవిబేధాలు లేకుండా సాఫీగా పాలన సాగిస్తారని అధిష్టానం భావించింది. ఈ క్రమంలోనే మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఉన్న సిద్ధరామయ్యకు సీఎం పదవి కట్టబెట్టేందుకు పార్టీ అధిష్టానం సిద్ధమైంది.

అలాగే డీకే శివకుమార్ విషయానికొస్తే అతనిపై ఉన్న కేసులు సీఎం పదవి అదిరోహించడానికి అడ్డంకిగా మారినట్లు తెలుస్తోంది. శివకుమార్‌పై పెండింగ్‌లో 19 కేసులు ఉన్నాయి. 2013- 18 కాలంలో మంత్రిగా ఉన్న శివకుమార్.. అక్రమ ఆస్తులు సంపాదించారని సీబీఐ అభియోగం మోపింది. ఇప్పటికే అక్రమాస్తుల కేసులో శివకుమార్ అరెస్టయ్యి విడుదలయ్యారు. దీనికితోడు 135 మంది ఎమ్మెల్యేల్లో దాదాపు 40 మంది ఎమ్మెల్యేల మద్దతే శివకుమార్ కు ఉండటంతో అధిష్టానం సిద్ధరామయ్యకే సీఎం పదవి ఇచ్చేందుకు మొగ్గుచూపినట్లు పార్టీ వర్గాల సమాచారం. ఇలా పలుకారణంలో డీకేశికి సీఎం సీటును దూరం చేయగా అవినీతి మరక అంటుకోని నేతగా సిద్ధరామయ్యను మరోసారి సీఎం పీఠానికి అర్హుడిగా మార్చింది.