Siddaramaiah-Yediyurappa : కాక రేపుతున్న కన్నడ రాజకీయం..సిద్ధరామయ్య-యడియూరప్ప రహస్య భేటీ!

  కర్ణాటక మాజీ సీఎంలు సిద్ధరామయ్య, యడియూరప్ప రహస్యంగా భేటీ అయ్యారన్న వార్తలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. మంగళవారం మైసూర్ లో కుమారస్వామి చేసిన వ్యాఖ్యలతో...కర్ణాటక రా

Siddaramaiah-Yediyurappa : కాక రేపుతున్న కన్నడ రాజకీయం..సిద్ధరామయ్య-యడియూరప్ప రహస్య భేటీ!

Karnataka (5)

Siddaramaiah-Yediyurappa       కర్ణాటక మాజీ సీఎంలు సిద్ధరామయ్య, యడియూరప్ప రహస్యంగా భేటీ అయ్యారన్న వార్తలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. మంగళవారం మైసూర్ లో కుమారస్వామి చేసిన వ్యాఖ్యలతో…కర్ణాటక రాజకీయం అనూహ్య మలుపు తిరగబోతుందా, సన్నిహితులపై ఐటీ దాడుల నేపథ్యంలో కమలదళానికి యడియూరప్ప షాక్ ఇవ్వబోతున్నారా అనే ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.

సిద్ధరామయ్య, యడియూరప్ప ఇటీవల అర్థరాత్రి వేళ రహస్యంగా భేటీ అయ్యారని, కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఆ విషయం తెలుసుకుందని..దాని ఫలితంగానే ఇటీవల యడియూరప్ప సన్నిహితుల ఇళ్లు,కార్యాలయాల్లో ఐటీ సోదాలు జరిగాయని మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి మంగళవారం మైసూరులో ఆరోపించారు. ఐటీ దాడులతో యడియూరప్పను బీజేపీ నియంత్రించాలని చూస్తోందని కుమారస్వామి తెలిపారు. రాజకీయాలపై కాస్త అవగాహన ఉన్నవారు ఎవరైనా ఐటీ దాడులు ఎందుకు జరుగుతున్నాయో అర్థం చేసుకోగలరన్నారు.

కాగా,గత వారం యడియూరప్ప కుమారుడు విజయేంద్ర సన్నిహితులపై జరిగిన ఐటీ సోదాల్లో లెక్కల్లో చూపించని రూ.750కోట్లు బయటపడిన విషయం తెలిసిందే. ఇందులో రూ.487కోట్ల ఆదాయాన్ని తాము లెక్కల్లో చూపించలేదని స్వయంగా ఆయా సంస్థల సభ్యులు అంగీకరించారు.

అయితే తాము రహస్యంగా భేటీ అయ్యామని కుమారస్వామి చేసిన ఆరోపణలను సిద్ధరామయ్య,యడియూరప్ప బుధవారం కొట్టిపారేశారు. రహస్య భేటీ అంటూ వస్తున్న వార్తలు అవాస్తమని సిద్ధరామయ్య అన్నారు. తాను,యడియూరప్ప రహస్యంగా భేటీ అయినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని కుమారస్వామికి సవాలు చేశారు. గతంలో ఓసారి యడియూరప్పను ఆయన పుట్టినరోజు సందర్భంగా మాత్రమే కలిసినట్లు సిద్ధరామయ్య తెలిపారు. ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత హోదాలో ఆయన్ను ఎప్పుడూ వ్యక్తిగతంగా కలవలేదన్నారు. తమకు కరోనా వచ్చి ఒకే హాస్పిటల్ లో ఉన్నప్పుడు కూడా ఆయన్ను కలవలేదని… యడియూరప్పను పదేపదే కలిసింది కుమారస్వామినేనని సిద్ధరామయ్య అన్నారు.

2020 ఫిబ్రవరి 27న తన పుట్టినరోజునాడు మినహా ప్రతిపక్ష నేత సిద్ధరామయ్యను తాను వ్యక్తిగతంగా ఎప్పుడూ కలవలేదని యడియూరప్ప ట్వీట్ చేశారు. సిద్ధాంతాల విషయంలో తాను ఎప్పుడూ రాజీపడలేదని, కర్ణాటకలో భాజపాను మళ్లీ అధికారంలోకి తీసుకురావడమే తన ఏకైక లక్ష్యమని స్పష్టం చేశారు.

ALSO READ Karnataka Congress : డీకే శివకుమార్ లంచాలు తీసుకుంటారు..సొంతపార్టీ నేతల సంభాషణ వీడియో వైరల్