Amarinder Singh..సిద్ధూ దేశానికే డేంజర్..కాంగ్రెస్ కి 10 సీట్లు కూడా కష్టమే!

పంజాబ్ పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూపై మాజీ సీఎం అమరీందర్ సింగ్ మాటల దాడి కొనసాగిస్తూనే ఉన్నారు. సిద్ధూ..దేశానికి ప్రమాదకరం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు అమరీందర్ సింగ్.

Amarinder Singh..సిద్ధూ దేశానికే డేంజర్..కాంగ్రెస్ కి 10 సీట్లు కూడా కష్టమే!

Amarender (1)

Amarinder Singh పంజాబ్ పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూపై మాజీ సీఎం అమరీందర్ సింగ్ మాటల దాడి కొనసాగిస్తూనే ఉన్నారు. సిద్ధూ..దేశానికి ప్రమాదకరం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు అమరీందర్ సింగ్. బుధవారం ఓ ఇంటర్వ్యూలో అమరీందర్ మాట్లాడుతూ… సిద్దూని రానున్న కాలంలో పంజాబ్ ముఖ్యమంత్రిగా ప్రచారంలోకి తీసుకొస్తే తాను అన్ని విధాలా అడ్డుకుంటానని స్పష్టం చేశారు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో సిద్ధూని ఓడించటానికి తన తరుఫున బలమైన అభ్యర్థిని కూడా బరిలోకి దింపుతానని ప్రకటించారు. వచ్చే ఏడాది జరగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో సిద్ధూ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ముందుకెళితే.. రాష్ట్రంలో పార్టీకి పది సీట్లు కూడా రావని ఘాటుగా వ్యాఖ్యానించారు.

పంజాబ్.. పాకిస్తాన్ తో సరిహద్దు కలిగి ఉండే ఓ సున్నితమైన రాష్ట్రమన్న అమరీందర్..జాతీయ భద్రత ప్రాధాన్యత దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వ నాయకత్వం కేంద్రప్రభుత్వంతో కలిసి పనిచేయడం చాలా అవసరమన్నారు. అలాంటిది, పాకిస్తాన్ కి దగ్గరిగా ఉండే వ్యక్తి చేతుల్లో ఈ రాష్ట్రాన్ని ఉంచకూడదని అన్నారు. సిద్ధూ నాయకత్వం పంజాబ్ కి ప్రమాదకరమని అమరీందర్ సింగ్ అన్నారు. సిద్ధూ లాంటి ప్రమాద‌కారి నుంచి దేశాన్ని కాపాడ‌టం కోసం తాను ఎంత‌టి త్యాగానికైనా సిద్ధ‌మ‌ని అమ‌రీంద‌ర్‌సింగ్ వ్యాఖ్యానించారు.

హైకమాండ్ సలహాదారులను తప్పుబట్టిన అమరీందర్
సీఎం పదవికి తర రాజీనామా వెనుక జరగిన విషయాలను గురించి అమరీందర్ బయటపెట్టారు. అమరీందర్ మాట్లాడుతూ.. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి మూడు వారాల ముందే నా రాజీనామాను అందించా. అయితే ఆమె నువ్వే సీఎంగా ఉండాలి అని నన్ను కోరింది. సోనియాగాంధీ నాకు కాల్ చేసి..రాజీనామా చేయమని అడిగితే నేను చేసుండేవాడిని..ఒక సైనికుడిగా, నా పని ఎలా చేయాలో నాకు తెలుసు మరియు ఒకసారి నన్ను పిలిచిన తర్వాత వెళ్లిపోతాను. పంజాబ్‌లో కాంగ్రెస్‌ని మరో ఘనవిజయం సాధించి, ముఖ్యమంత్రిగా మరొకరిని అనుమతించడానికి నేను సిద్ధంగా ఉన్నానని సోనియా గాంధీకి కూడా చెప్పాను. కానీ అలా జరగలేదు. కాబట్టి నేను పోరాడతాను అని అమరీందర్ నొక్కి చెప్పాడు.

తాను ఎమ్మెల్యేలను గోవా లేదా మరో ప్రదేశానికి విమానంలో తీసుకెళ్లే వాడిని కాదని.. తాను అలా వ్యవహరించనని..జిమ్మిక్కులు చేయనుని మరియు అది తన మార్గం కాదని గాంధీ కుటుంబానికి బాగా తెలుసు అని అమరీందర్ అన్నారు. ప్రియాంక గాంధీ మరియు రాహుల్ గాంధీ తన పిల్లలు లాంటి వారన్న అమరీందర్..తన రాజీనామా వ్యవహారం ఇలా ముగిసి ఉండకుండా ఉండాల్సిందని.తాను చాలా నేను బాధపడ్డానని అమరీందర్ తెలిపారు. పార్టీ హైకమాండ్ కి సలహాదారులుగా ఉన్న రణదీప్ సింగ్ సుర్జేవాలా,కేసీ వేణుగోపాల్ లు తప్పుడు సలహాలను అధినాయకత్వానికి ఇస్తున్నారని అమరీందర్ మండిపడ్డారు.

అయితే మీరు కాంగ్రెస్ లోనే కొనసాగుతారా లేక బీజేపీలో చేరబోతున్నారా లేక సొంత పార్టీ పెడతారా అనే ప్రశ్నకు…ప్రస్తుతానికి తానేమీ నిర్ణయం తీసుకోలేదని..మొదట తన మద్దుతుదారులతో మాట్లాడి అప్పుడు తన నిర్ణయం చెబుతానని అమరీందర్ జావాబిచ్చారు

ఇక,పంజాబ్ కొత్త సీఎంగా బాధ్యతలు చేపట్టిన చరణ్ జీత్ సింగ్ చున్నీ మంచి మంత్రి, తెలివైన వ్యక్తి అని అమరీందర్ అన్నారు. అతను నవజ్యోత్ సింగ్ సిద్ధు ప్రభావంలోకి రానంత కాలం, అతను ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడపగలడని అన్నారు.