Terror Finance: తీవ్రవాదులకు ఆర్ధిక సహాయం చేస్తున్న ఘటనల్లో దేశ వ్యాప్తంగా 103 కేసులు: కేంద్రం వెల్లడి

ఉగ్రవాద కార్యకలాపాలకు ఆర్ధిక సహాయం అందిస్తున్న వ్యక్తులు, సంస్థలపై జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 103 కేసులు నమోదు

Terror Finance: తీవ్రవాదులకు ఆర్ధిక సహాయం చేస్తున్న ఘటనల్లో దేశ వ్యాప్తంగా 103 కేసులు: కేంద్రం వెల్లడి

Nia

Terror Finance: ఉగ్రవాద కార్యకలాపాలకు ఆర్ధిక సహాయం అందిస్తున్న వ్యక్తులు, సంస్థలపై జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 103 కేసులు నమోదు చేసిందని కేంద్ర ప్రభుత్వం మంగళవారం లోక్ సభకు తెలిపింది. లోక్‌సభలో సభ్యులు అడిగిన ప్రసన్నకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ సమాధానం ఇచ్చారు. 2008లో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటివరకు మొత్తం 103 కేసుల్లో 786 మందిని అరెస్ట్ చేశారని..వాటిలో 92 కేసుల్లో 865 మందిపై చార్జిషీట్లు నమోదైనట్లు ఆయన వివరించారు. ఫెడరల్ యాంటీ టెర్రర్ ఏజెన్సీ 16 కేసుల్లో 97 మంది నిందితులను దోషులుగా నిర్ధారించిందని నిత్యానంద్ రాయ్ పేర్కొన్నారు.

Also read:Prisoners Cellphone: జైల్లో సెల్ ఫోన్ వాడుతూ పట్టుబడే ఖైదీలకు శిక్ష పెంచనున్న కర్ణాటక రాష్ట్రం

ఢిల్లీ ప్రధాన కేంద్రంగా పనిచేసే జాతీయ దర్యాప్తు సంస్థకు దేశ వ్యాప్తంగా 18 ప్రాంతాల్లో శాఖలు ఉన్నాయని వాటిలో పది ప్రధాన కార్యాలయాలు చండీగఢ్, రాంచీ, ఇంఫాల్, చెన్నై, అహ్మదాబాద్, బెంగళూరు, పాట్నా, జైపూర్, భోపాల్ మరియు భువనేశ్వర్ నగరాల్లో ఉన్నట్లు నిత్యానంద రాయ్ వివరించారు. ఆయా కేంద్రాల్లో పనిచేసేందుకు గానూ అవసరమైన 481 మంది వృత్తి నిపుణులను 2019 నుంచి ఇప్పటివరకు రిక్రూట్ చేసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Also read:Surajkund Crafts Mela: రెండేళ్ల అనంతరం ప్రారంభమైన “సూరజ్‌కుండ్ ఇంటర్నేషనల్ క్రాఫ్ట్స్ మేళా”

ఇది కాక..ఎన్ఐఏకు అవసరమైన మానవవనరులు, ఇతర మౌళిక సదుపాయాల పై ఎప్పటికప్పడు సంబంధిత అధికారులతో పర్యవేక్షించి..ఆయా వనరులను మరింత మెరుగుపర్చుతున్నట్లు నిత్యానంద రాయ్ తెలిపారు. ఎన్ఐఏ సంస్థ అడిగిన అన్ని సదుపాయాలను సమకూర్చడంతో సంస్థ మరింత సమర్ధవంతంగా పనిచేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా NIA అంచనా వేసిన అవసరాల ఆధారంగా, సంస్థకు అవసరమైన న్యాయ, శాస్త్రీయ, సమాచార సాంకేతిక నిపుణులు మొదలైన పోస్టులను కూడా ప్రభుత్వం ఎప్పటికప్పుడు నెరవేరుస్తున్నట్లు నిత్యానంద రాయ్ చెప్పారు.