Delhi High Court : అమ్మపోరాటాన్ని గెలిపించిన కోర్టు, బాలుడి పాస్‌పోర్టులో తండ్రి పేరు తొలగించాలని తీర్పు

ఓ ఒంటరి మహిళ చేసిన పోరాటాన్ని గెలిపించింది న్యాయస్థానం. ఓ కన్నతల్లి చేసిన పోరాటానికి అర్థం పరమార్థం ఉందని నిరూపించింది ఢిల్లీ హైకోర్టు. తన కొడుకు కడుపులో ఉండగానే వదిలేసి పోయిన భర్త పేరు తొలగించుకోవటానికి ఓ తల్లి చేసిన పోరాటానికి ఊరటనిచ్చింది ధర్మాసనం.

Delhi High Court : అమ్మపోరాటాన్ని గెలిపించిన కోర్టు, బాలుడి పాస్‌పోర్టులో తండ్రి పేరు తొలగించాలని తీర్పు

Delhi High Court

Delhi High Court : ఓ ఒంటరి మహిళ చేసిన పోరాటాన్ని గెలిపించింది న్యాయస్థానం. ఓ కన్నతల్లి పోరాటానికి అర్థం పరమార్థం ఉందని నిరూపించింది ఢిల్లీ హైకోర్టు. తన కొడుకు కడుపులో ఉండగానే వదిలేసి పోయిన భర్త పేరు తొలగించుకోవటానికి ఓ తల్లి చేసిన పోరాటానికి ఊరటనిచ్చింది ధర్మాసనం. ఆ బాలుడి పాస్ పోర్టులో తండ్రి పేరు తొలగించండీ అని ఆదేశించింది.

కన్నబిడ్డను గుండెల్లో పెట్టుకుని పెంచినా ఆ బిడ్డ పెద్దయ్యాక తండ్రి పేరే ముఖ్యమంటున్నాయి రూల్స్. బాద్యతలేని తండ్రి పేరు అతని ఇంటిపేరు ప్రధానమంటున్నాయి నిబంధనలు. కట్టుకున్నవాడు వదిలేసిపోయినా బిడ్డల్ని కష్టపడి పెంచిన తల్లికి ప్రాధాన్యత లేదా? స్కూల్లో చదువుకోవాలన్నా..దృవీకరణ పత్రాలు కావాలన్నా..పాస్ పోర్టు కావాలన్నా తండ్రి పేరు ఉండాల్సిందేనా అంటే ఉందని తేల్చి చెప్పింది ఢిల్లీ హైకోర్టు. భార్య కడుపుతో ఉండగా బిడ్డ పుట్టకముందే వదిలివెళ్లిపోయిన తండ్రి పేరును పాస్‌పోర్టులో చేర్చాల్సిన అవసరం లేదని ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది.

తాను గర్భవతిగా ఉండగానే వదిలి వెళ్లిపోయినా ఒంటరిగా బిడ్డను పెంచింది ఓ మహిళ. తన మైనర్ కుమారుడి పాస్‌పోర్టు విషయంలో కోర్టులో పిటిషన్‌ వేసిందామె. కడుపులో ఉండగానే తన బిడ్డను తండ్రి వదిలి వెళ్లిపోయాడని.. ఆ తర్వాత ఆ బిడ్డ బాధ్యతలన్నీ తానే చూసుకున్నానని..కష్టపడి పెంచుకున్నానని పిటీషన్ లో పేర్కొందామె. కానీ బాధ్యతలేని తండ్రి పేరు తన కుమారుడి పాస్ పోర్టులో ఎందుకుండాలి? దయచేసిన నా కుమారుడి పాస్‌పోర్టులో తండ్రి పేరును తొలగించి కొత్తది జారీ చేయాలని కోరుతో ఢిల్లీ హైకోర్టును ఆశ్రంచింది.

ఈ పిటిషన్‌ పరిశీలించిన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రతిభా ఎం సింగ్‌ కీలక తీర్పునిచ్చారు.‘తండ్రి బిడ్డను పూర్తిగా వదిలిపెట్టిన కేసు ఇది. మైనర్‌ కుమారుడి పాస్‌పోర్టు నుంచి తండ్రి పేరు తొలగించి వారంలోపు కొత్త పాస్ పోర్టు జారీ చేయాలని అధికారులను ఆదేశిస్తున్నాం అని తీర్పును వెలువరించారు. ఇటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో తండ్రి పేరు తొలగించుకోవచ్చని అంతేకాకుండా ఇంటి పేరు కూడా మార్చుకోవచ్చని తీర్పునిచ్చారు. తల్లి ఇష్ట ప్రకారం..వారికి ఆమోదమైతే వారి తాతయ్య (తల్లికి తండ్రి)ఇంటి పేరు పెట్టుకోవచ్చిన సూచించారు.

తల్లిదండ్రుల వైవాహిక విషయంలో విభేధాలు ఉంటే ఆయా పరిస్థితులను పిల్లల పాస్ పోర్టు దరఖాస్తు విషయంలో అధికారులు పరిగణిలోకి తీసుకోవాలని కోర్టు ఈ సందర్భంగా సూచించింది.తండ్రి పేరు లేకుండా పాస్‌పోర్ట్‌లను వివిధ పరిస్థితులలో జారీ చేయవచ్చని పాస్‌పోర్ట్ మాన్యువల్,OM (ఆఫీస్ మెమోరాండం)రెండూ గుర్తించాయని కోర్టు పేర్కొంది.