Delta Variant: డెల్టా వేరియంట్‌పై పనిచేస్తున్న ఫైజర్, ఆస్ట్రాజెనికా!

ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కరోనా వేరియంట్లు ఇండియాను వణికిస్తున్నాయి. ముఖ్యంగా భారత్​లో డెల్టా ప్లస్​ వేరియంట్ ఆందోళనకరంగా మారింది. కే417ఎన్​ మ్యూటేషన్ల వల్ల మోనోక్లోనల్​ యాంటీబాడీల స్పందనను తగ్గించడంతో పాటు.. వ్యాక్సినేషన్ అనంతరం వాటి నుంచి తప్పించుకునే అవకాశం ఉందని కొందరు నిపుణులు చెప్తున్నారు.

Delta Variant: డెల్టా వేరియంట్‌పై పనిచేస్తున్న ఫైజర్, ఆస్ట్రాజెనికా!

Delta Variant

Delta Variant: ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కరోనా వేరియంట్లు ఇండియాను వణికిస్తున్నాయి. ముఖ్యంగా భారత్​లో డెల్టా ప్లస్​ వేరియంట్ ఆందోళనకరంగా మారింది. కే417ఎన్​ మ్యూటేషన్ల వల్ల మోనోక్లోనల్​ యాంటీబాడీల స్పందనను తగ్గించడంతో పాటు.. వ్యాక్సినేషన్ అనంతరం వాటి నుంచి తప్పించుకునే అవకాశం ఉందని కొందరు నిపుణులు చెప్తున్నారు. కొత్తగా వస్తున్న డెల్టా, డెల్టా ప్లస్ ఈ వేరియంట్లపై వ్యాక్సిన్లు కూడా సమర్ధవంతంగా పనిచేయడం లేదని ప్రచారం జరుగుతుంది.

దీనిపై ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు డెల్టా వేరియంట్లపై పనిచేస్తాయా లేదా అని భారత్​ కూడా పరిశోధనలు చేస్తోంది.. త్వరలోనే ఫలితాలు కూడా రానున్నాయి. అయితే ఫైజర్, ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్లు​ టీకా సింగిల్​ డోసు తీసుకున్నా డెల్టా వేరియంట్​పై పని చేస్తుందని నేచర్ జర్నల్‌లో ప్రచురితమైంది. ప్రపంచవ్యాప్తంగా ప్రబలంగా మారుతున్నందున కరోనావైరస్ యొక్క వైరల్ ఉత్పరివర్తనాల వల్ల కలిగే ముప్పును నేచర్ జర్నల్‌లో ప్రచురించిన ఈ అధ్యయనం హైలైట్ చేసింది.

భారతదేశంలో మొట్టమొదట కనుగొనబడిన డెల్టా వేరియంట్‌లో ఉత్పరివర్తనలు ఉన్నాయని పరిశోధకులు కనుగొనగా.. ఇది టీకాలు, యాంటీబాడీలను తప్పించుకునేందుకు వీలు కల్పిస్తున్నాయని పలు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. అయితే.. ఫైజర్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ తీసుకున్న వారు డెల్టా నుండి కూడా పూర్తిస్థాయి రక్షణ కలిగి ఉన్నారని.. ఈ రెండు వ్యాక్సిన్లను కనీసం ఒక షాట్ తీసుకున్న వ్యక్తులు కూడా డెల్టా వేరియంట్ పై రక్షణ కలిగి ఉన్నారని జర్నల్ పేర్కొంది. ఈ జర్నల్ అధ్యయనం ప్రకారం త్వరతిగతిన రెండు డోసుల వ్యాక్సినేషన్ త్వరగా పూర్తి చేయాల్సిన ఆవశ్యకత కనిపిస్తుంది.