Single Use Plastic Ban: నేటి నుంచి ఈ వస్తువులు బ్యాన్.. వాడారో.. ఫెనాల్టీ కట్టాల్సిందే..

ప్లాస్టిక్ కాలుష్యం నుండి పర్యావరణాన్ని కాపాడే క్రమంలో నేటి నుండి 'సింగిల్ యూజ్ ప్లాస్టిక్' వాడకాన్ని నిషేధించాలని రాష్ట్రాలను కోరుతూ కేంద్రం మార్గదర్శకాలను జారీ చేసింది. దేశవ్యాప్తంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై నిషేధం శుక్రవారం నుంచి అమల్లోకి రానుంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వాలు ప్రచారాన్ని ప్రారంభిస్తాయని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు.

Single Use Plastic Ban: నేటి నుంచి ఈ వస్తువులు బ్యాన్.. వాడారో.. ఫెనాల్టీ కట్టాల్సిందే..

Single Use Plastic Ban: ప్లాస్టిక్ కాలుష్యం నుండి పర్యావరణాన్ని కాపాడే క్రమంలో నేటి నుండి ‘సింగిల్ యూజ్ ప్లాస్టిక్’ వాడకాన్ని నిషేధించాలని రాష్ట్రాలను కోరుతూ కేంద్రం మార్గదర్శకాలను జారీ చేసింది. దేశవ్యాప్తంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై నిషేధం శుక్రవారం నుంచి అమల్లోకి రానుంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వాలు ప్రచారాన్ని ప్రారంభిస్తాయని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. పలు రకాల వస్తువులు, ఆహార పదార్థాలు, పలు పానియాలు ప్యాకింగ్ చేసే సమయంలో, పాలిథిన్ బ్యాగులు, ఫేస్ మాస్క్‌లు, కాఫీ కప్పులు ఇలా మొదలైన వాటి వరకు తయారు చేయబడిన, ఉపయోగిస్తున్న ప్లాస్టిక్‌లో అత్యధిక వాటాను సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను వినియోగిస్తున్నారు.

RBI On Cryptocurrencies : ముప్పు తప్పదు.. క్రిప్టో కరెన్సీపై ఆర్బీఐ గవర్నర్ వార్నింగ్

The UN Environment Programme (UNEP) ప్రకారం.. ప్రతి నిమిషానికి ఒక మిలియన్ ప్లాస్టిక్ సంచులు కొనుగోలు చేస్తున్నట్లు అంచనా. అయితే ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఐదు ట్రిలియన్ల ప్లాస్టిక్ సంచులు ఉపయోగించబడుతున్నాయి. ఉత్పత్తి చేయబడిన మొత్తం ప్లాస్టిక్‌లో సగం సింగిల్-యూజ్ ప్రయోజనాల కోసం రూపొందించబడింది. ఒక్కసారి మాత్రమే ఉపయోగించబడి ఆపై తొలగించాల్సి ఉంటుంది. తాజాగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై నిషేధాన్ని ఉల్లంఘిస్తే.. పర్యావరణ పరిరక్షణ చట్టం(ఈపీఏ)లోని సెక్షన్‌ 15, సంబంధిత మున్సిపల్‌ కార్పొరేషన్ల నిబంధనల కింద జరిమానా లేదా జైలుశిక్ష లేదా రెండూ ఉంటాయని కేంద్రం హెచ్చరించింది. నిషేధాన్ని సమర్థంగా అమలు చేసేందుకు జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేయనున్నారు.

సింగిల్ యూజ్-ప్లాస్టిక్ నుండి ఉత్పత్తయ్యే వ్యర్థాల సంక్షోభాన్ని అధిగమించేందుకు.. పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ గత ఏడాది ఆగస్టులో నోటిఫికేషన్ జారీ చేసింది. 1జూలై 2022 నుండి సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై నిషేధాన్ని ప్రకటించింది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPCB) జూలై 1 నుండి మార్కెట్లో ఏమి నిషేధించబడుతుందో, నిషేధించిన వాటిని వాడితే ఎలాంటి పెనాల్టీ ఉంటుందో అనే విషయాలను వివరణాత్మక మార్గదర్శకాలను విడుదల చేసింది. పాలీస్టైరిన్‌తో సహా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ తయారీ, దిగుమతి, నిల్వలు, పంపిణీ, అమ్మకం, ఉపయోగం, ప్లేట్లు, కప్పులు, గ్లాసులతో సహా పలు రకాల వస్తువులు నేటి నుంచి నిషేధించబడతాయి.

Plastic

నేటి నుంచి నిషేధించబడే వస్తువులు ఇవే ..
బెలూన్లకు వాడే ప్లాస్టిక్ స్టిక్స్, సిగరెట్ ప్యాకెట్లు, ప్లాస్టిక్ ప్లేట్లు, ప్లాస్టిక్ గ్లాసులు, ఫోర్కులు, స్పూన్లు, కత్తులు, ట్రేలతో సహా ఇయర్‌బడ్స్. స్వీట్ బాక్సుల ప్యాకింగ్ కు వాడే పల్చటి రేపర్స్, ఐస్ క్రీం కర్రలు, పిప్పరమెంట్లకు వినియోగించే ప్లాస్టిక్ పుల్లలు, ఆహ్వాన కార్డులులతో పాటు అలంకరణ కోసం వినియోగించే పాలీస్టైరిన్, 100 మైక్రాన్‌ల కంటే తక్కువ పరిమాణంలో ఉండే PVC బ్యానర్‌లు, ద్రవ పదార్థాలను కలిపేందుకు వాడే పుల్లలు .