Snake Bite : పాము కాటుకు అక్కాతమ్ముడు బలి

పాము కాటుకు అక్కాతమ్ముళ్ల బలైయ్యారు. ఈ విషాద ఘటన మహారాష్ట్రలోని సాంగలీ జిల్లాలో చోటుచేసుకుంది.

Snake Bite : పాము కాటుకు అక్కాతమ్ముడు బలి

Snake Bite

Snake Bite : పాము కాటుకు అక్కాతమ్ముళ్ల బలైయ్యారు. ఈ విషాద ఘటన మహారాష్ట్రలోని సాంగలీ జిల్లాలో చోటుచేసుకుంది. ఘటన వివరాల్లోకి వెళితే జిల్లాలోని ఖానాపూర్ తాలూకా ఆల్సంద్​ గ్రామానికి చెందిన రైతు సునిల్​ కదమ్‌కు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. అక్టోబర్ 6న ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో కుమారుడు విరాజ్​ సునిల్​ కదమ్(16)ను పాము కాటేసింది. తెల్లారిన తర్వాత కుమారుడిని గమనించిన కుటుంబ సభ్యులు నోటి వెంట నురగ కనిపించడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు.

చదవండి : Rattlesnake : వామ్మో.. ఒక్కచోటే 92 పాములు.. హడలిపోయిన యజమాని

అయితే మార్గమధ్యంలోనే విరాజ్​ సునిల్​ కదమ్ మృతి చెందాడు. సోదరుడి అత్యక్రియలకు హాజరైన పెద్ద అక్క సాయలీ జాదవ్(22)​ను అక్టోబర్​ 8న అదే పాము కాటు వేసింది. దీంతో వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆరోగ్యపరిస్థితి విషమించడంతో ఆమె ఈ నెల 15న మృతి చెందారు. ఒకే కుటుంబంలో ఇద్దరు మృతి చెందటంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక చనిపోయిన సాయలీ జాదవ్‌కు ఏడాది పాప ఉంది.

చదవండి : Boy plays with snake : రెండేళ్ల బుడ్డోడు 12 అడుగుల పాము తోక పట్టుకుని ఆటలు..