Sister Library : దక్షిణాసియాలో తొలి స్త్రీవాద గ్రంథాలయం

స్త్రీవాద రచనలకు కేరాఫ్ అడ్రస్ గా ఉంది ముంబైలోని ‘సిస్టర్‌ లైబ్రరీ’. మహిళల కోసమే ఏర్పాటైన ఈ గ్రంథాలయాన్ని ఆర్టిస్ట్‌ అక్వీ థామీ ప్రారంభించారు. ఇది దేశంలోనే కాదు దక్షిణ ఆసియాలోనే మొట్టమొదటి స్త్రీవాద గ్రంథాలయం.

Sister Library : దక్షిణాసియాలో తొలి స్త్రీవాద గ్రంథాలయం

 

Sister Library in Mumbai : ఒక మంచి పుస్తకం చదివితే ఓ మంచి స్నేహితుడు దొరికినట్లు..అదే పుస్తకాన్ని మరోసారి కలిసినట్లుగా అంటారు పుస్తక ప్రియులు. ఎంతోమంది కవులు..మేధావులు ఎన్నో పుస్తకాలు రాశారు. పుస్తకం అనేది విజ్ఞాన భాండాగారం. అటువంటి పుస్తకాల్లో స్త్రీవాద రచనలది ప్రత్యేక స్థానమనే చెప్పాలి. స్త్రీవాద రచనలు స్త్రీలకు సంబంధించిన అన్ని కోణాలను ప్రతిబింభిస్తుంటాయి. అటువంటి స్త్రీవాద రచనలకు కేరాఫ్ అడ్రస్ గా ఉంది ముంబైలోని ‘సిస్టర్‌ లైబ్రరీ’. మహిళల కోసమే ఏర్పాటైన ఈ గ్రంథాలయాన్ని ఆర్టిస్ట్‌ అక్వీ థామీ ప్రారంభించారు. ఇది దేశంలోనే మొట్టమొదటి స్త్రీవాద గ్రంథాలయం.

Sister Library | Aqui Thami — The Foundation for Indian Contemporary Art

అది ముంబైలోని ధారావి.. మురికివాడలకు చిరునామా. అక్కడే పురుడుపోసుకుంది ‘సిస్టర్‌ లైబ్రరీ’. ఆర్టిస్ట్‌ అక్వీ థామీ మహిళల కోసమే ఏర్పాటు చేశారు ఈ గ్రంథాలయాన్ని. ఇది దేశంలోనే మొట్టమొదటి స్త్రీవాద గ్రంథాలయం. అంతేకాదు దక్షిణాసియాలో తొలి స్త్రీవాద గ్రంథాలయం. లోపలికి అడుగుపెట్టగానే ఆలోచన రేకెత్తించే పుస్తకాలు కళ్లముందు సాక్షాత్కరిస్తాయి. మహిళా కోణాల్ని చదివేయమంటాయి. ఈ పుస్తకాలు రాసినవారు కూడా మహిళలే.

అవును.. రచయిత్రుల సాహిత్యానికే ఆ లైబ్రరీలో కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది. ఈ లైబ్రరీని కమ్యూనిటీ హాలుగా తీర్చిదిద్ది.. స్థానికులతో అక్షరాభ్యాసం కూడా చేయిస్తున్నారు అక్వీ థామీ. ఐదు సంవత్సారాల  క్రితం 100 పుస్తకాలతో ప్రారంభమైన ఈ గ్రంథాలయం ఇప్పుడు వెయ్యికి పైనే పుస్తకాలకు స్థానంగా నిలిచింది. నేపాల్‌, బంగ్లాదేశ్‌, న్యూజిలాండ్‌, అమెరికా దేశాల సాహిత్యానికీ ఇందులో స్థానం కల్పించారు. ఇదే ఉత్సాహంతో ‘రేడియో సిస్టర్‌’ కార్యక్రమాన్ని ప్రారంభించారు థామీ. ‘సిస్టర్‌ ప్రెస్‌’ ద్వారా ఇక్కడ ముద్రణలో మహిళలకు శిక్షణ ఇస్తున్నారు. ‘సిస్టర్‌ టైమ్స్‌’ మాసపత్రికను స్థానిక మహిళలే ముద్రిస్తారు.

Interview with Sister Library in Mumbai – The Feminist Library

స్త్రీవాద రచనలు..అపోహలు..
స్త్రీవాద రచనలు కేవలం మహిళలే రాస్తారు అనే మాట నిజం కాదు. చరిత్రను పరిశీలిస్తే ఎంతోమంది మహానుభావులు స్త్రీ కోణాలను తమ రచనలద్వారా ప్రతిబింభించారు. వారిలో గురజాడ స్త్రీకోణం నుంచి ఆలోచించడం మొదలు పెట్టిన రచయితగా అని చెప్పుకుని తీరాలి. స్త్రీల అనుభవం, పురుషుల అనుభవం కంటే భిన్నంగా ఉంటుందని గురజాడి భావించారు. స్త్రీల ప్రశ్నలు స్త్రీ జీవితానుభవం నుంచి వస్తాయి కాబట్టి వాటిని జవాబు చెప్పగల సత్తా పురుషుడికి లేదని గురజాడ అభిప్రాయం. ఇలా స్త్రీల కోణంలో ఆలోచించిన ప్రథమ రచయితగా గురజాడను తీసుకోవచ్చు. ఆ విధంగా తెలుగు కథానిక పుట్టడమే మహిళల జీవితాన్ని కథావస్తువుగా తీసుకొని పుట్టింది. స్త్రీవాద దృక్కోణంలో 60లలో రాసిన వాళ్ళంతా మార్క్సిస్టు దృక్పథంగలవారు. వీరిలో ముఖ్యులు ప్రముఖ రచిత్రులు ఓల్గా. రంగనాయకమ్మలు ఉన్నారు.రంగనాయకమ్మ గారి శైలి చాలా భిన్నంగా ఉంటుంది. ఆమె మార్క్సిస్టు దృక్పథాన్ని వీడలేదు. స్త్రీవాదం ఇతర దేశాలలో పుట్టింది. అరవై దశకంలో ఇతర దేశాల్లో వచ్చిన స్త్రీవాదం, 1980 ,90లనాటికి తెలుగు రాష్ట్రాలలోకి ప్రవేశించింది.

1949లో సిమోదబువ ‘సెకండ్ సెక్స్’ అనే గ్రంథం రాసింది. 1969లో మార్గరెట్ బెస్టన్ ‘పొలిటికల్ ఎకానమీ ఆఫ్ ఉమెన్’ లో స్త్రీల ఇంటి చాకిరిని వెలకట్టాలని చెప్పింది. 1970లో కేట్ మిల్లెట్ ‘సెక్సువల్ పాలిటిక్స్’ లో స్త్రీల అణచివేతకు పితృస్వామ్యం కారణమని తేల్చింది. 1972లో జర్నైన్ గ్రీల్ రాసిన ‘ద ఫిమేల్ యూనిక్’ లో స్త్రీ పురుషులను సెక్స్ పదంతో కాక జెండర్ పదంతో సూచించాలన్నారు. స్త్రీ ఆడతనాన్నే కాక స్త్రీ సంబంధ పదజాలాన్నంతా ఈ పదం తెలియ జేస్తుందన్నారు.’స్త్రీకి కూడా శరీరం ఉంది. దానికి వ్యాయామం ఇవ్వాలి. ఆమెకు మెదడు ఉంది..దానికి జ్ఞానం ఇవ్వాలి. ఆమెకు హృదయం ఉంది. దానికి అనుభవం ఇవ్వాలి’ అంటూ చలం స్త్రీవాదాన్ని ప్రవేశపెట్టారు. ఇలా స్త్రీవాద రచనల్లో స్త్రీ కోణాల్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది.