Twin Sisters Wedding: ఒకే వ్యక్తిని పెళ్లాడిన అక్కాచెల్లెళ్లు.. వరుడికి షాకిచ్చిన పోలీసులు
పింకీ, రింకీ అనే ఇద్దరు కవలలు ముంబయిలోని సాప్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. వీరిది మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లా మాల్షిరాస్ తాలూకా అక్లుజ్. వీరిద్దరు ఒకే వ్యక్తిని పెళ్లాడారు. ఈ వివాహం ఘనంగా జరిగింది. అయితే, పోలీసులు వరుడికి షాకిచ్చారు. ఈ పెళ్లి చెల్లదంటూ కేసు నమోదు చేశారు.

Twin Sisters Wedding: పింకీ, రింకీ అనే ఇద్దరు కవలలు ముంబయిలోని సాప్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. వీరిది మహారాష్ట్రలోని సోలాపూర్. కొద్దిరోజుల క్రితం వారి తండ్రి మరణించాడు. తల్లితోనే వారు ఉంటున్నారు. ఇటీవల తల్లికిసైతం అనారోగ్యంతో ఆస్పత్రిలో చేర్పించాల్సి వచ్చింది. ఈ క్రమంలో తల్లి అనారోగ్యం సమయంలో అక్కాచెల్లి తల్లిని ఆస్పత్రికి తీసుకెళ్లే ప్రయత్నంలో అతుల్ అనే వ్యక్తి వారికి సాయం అందించాడు. అతని కారులో వారిని ఆస్పత్రికి తీసుకెళ్లారు.
Viral News: దేవుడి పాదాలపై తలపెట్టి ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి.. వీడియో వైరల్
అతుల్తో వారికి పరిచయం ఏర్పడింది. కొద్దిరోజులుగా వారు మాట్లాడుకుంటున్నారు. అతుల్ ప్రవర్తన ఇద్దరు అక్కాచెల్లెళ్లకు నచ్చింది. దీంతో వారిద్దరూ అతుల్నే పెళ్లిచేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇరు కుటుంబాల పెద్దలుసైతం ఒప్పుకోవడంతో వారి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Two sisters, both IT professionals, from Mumbai marry same man from Akluj village in Solapur, Maharashtra. pic.twitter.com/xsTAaGhNAt
— Love (@LocalBabaji) December 4, 2022
ఈ వివాహంపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికితోడు సోషల్ మీడియాలో వైరల్ అయిన పెళ్లి వీడియోల ఆధారంగా, వరుడిపై ఫిర్యాదులు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. వరుడు అతుల్ పై అక్లూజ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 494 ప్రకారం నాన్ కాగ్నిజబుల్ నేరం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.