Sit under pipal tree for oxygen: ఆక్సిజన్​ కావాలంటే రావిచెట్టు కింద కూర్చుంటే చాలట : యూపీ పోలీసుల సలహా

ఆక్సిజన్ లేక కరోనా బాధితులు అల్లాడిపోతున్నారు. ఈక్రమంలో యూపీలోని ప్రయాగ్ రాజ్ బీజేపీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ వాజ్ పేయి ఆక్సిజన్ ప్లాంట్ ముందు బాధితుల బంధువులు ఆక్సిజన్ కోసం డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకుని ఆక్సిజన్ కావాలంటే రావిచెట్టు కింద కూర్చోవాలని సలహా ఇస్తున్నారని..ఓ బాధితుడికి కుమారుడు ఆవేదన వ్యక్తంచేశాడు.

Sit under pipal tree for oxygen: ఆక్సిజన్​ కావాలంటే రావిచెట్టు కింద కూర్చుంటే చాలట : యూపీ పోలీసుల సలహా

Sit Under Pipal Tree For Oxygen (1)

Sit under pipal tree for oxygen helpless Covid patients: ఆక్సిజన్​ కోసం ఆస్పత్రులకు వెళ్లక్కర్లేదు..రావి చెట్టుకింద కూర్చుంటే కావాల్సినంత ఆక్సిజన్ దొరుకుతుందని ఉత్తరప్రదేశ్ పోలీసులు సలహా ఇస్తున్నారట. ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో చాలా మంది పేషెంట్లకు ఎదురైన పరిస్థితి ఇది. కరోనా సోకిన తన తల్లిని ఆసుపత్రికి తీసుకువెళితే ఆక్సిజన్ సిలిండర్లుగానీ..ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు గానీ లేవన్నారనీ..ఆక్సిజన్ కావాలంటే రావి చెట్టు కింద కూర్చోపెట్టాలని పోలీసులు అన్నారని ఓ కరోనా పేషెంట్ కుమారుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్పత్రికి వచ్చిన ప్రతి ఒక్కరికీ పోలీసులు ఇదే విషయం చెబుతున్నారని మరో బాధితుడి బంధువు ఆవేదన వ్యక్తంచేశాడు.

శుక్రవారం (ఏప్రిల్ 30,2021) ప్రయాగ్ రాజ్ బీజేపీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ వాజ్ పేయి ఆక్సిజన్ ప్లాంట్ ముందు చాలా మంది కరోనా పేషెంట్ల బంధువులు భారీగా చేరుకున్నారు. ఆక్సిజన్ ప్లాంట్ ముందు నిలబడి ఆక్సిజన్ కోసం డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఆ ప్లాంట్ ను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ఆ ప్లాంట్ నుంచి ఆసుపత్రులకు ఆక్సిజన్ ను సరఫరా చేస్తోంది. ఈ క్రమంలో అక్కడ కూడా ఆక్సిజన్ కొరత ఉండడంతో ఎవరినీ పోలీసులు ఏ ఒక్కరిని లోపలికి వెళ్లటానికి అనుమతించలేదు. దీంతో అక్కడకు వచ్చిన వారంతా తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తూ..కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.

కరోనా పేషెంట్లు ఇంట్లోనే ఉండాలంటూ చెబుతున్నారు..కానీ ఇంట్లో కూడా ఆక్సిజన్ అందక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారని ఓ రోగి బంధువు కన్నీరుమున్నీరుగా విలపిస్తూ చెప్పుకొచ్చాడు. ఆసుపత్రులకు వెళితే అక్కడ బెడ్లన్నీ ఫుల్ అయిపోయాయని..తన తండ్రికి ఆక్సిజన్ కోసం ఎన్ని ప్లాంట్లు తిరిగినా దొరకట్లేదని ఆవేదన వ్యక్తంచేశాడు. ప్లాంట్ దగ్గరకు వస్తే ఇక్కడ బాధితులకు సమాధానం చెప్పేవారేలేరనీ..పోలీసులు మాత్రం తరిమికొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. నా తండ్రికి ఆక్సిజన్ అందకపోతే మేం ఎక్కడికెళ్లాలి? అని పోలీసుల్ని ప్రశ్నించగా..వెళ్లి ‘రావి చెట్టు’కింద కూర్చోండీ బోల్డంత ఆక్సిజన్ అందుతుందని పోలీసులు సలహా ఇస్తున్నారని వాపోయాడు.

కాగా దేశ వ్యాప్తంగా ఆక్సిజన్ కొరత కొనసాగుతోంది. ఓ పక్క పాలకులు ఆక్సిజన్ కొరత లేదని చెబుతున్నారు. కానీ అందుకు భిన్నంగా ఉంది పరిస్థితి. ప్రాణవాయువు కోసం బాధితులు అల్లాడుతున్నారు. వారి కుటుంబసభ్యులు ఆక్సిజన్ సిలిండర్లు పట్టుకుని ప్లాంట్ల చుట్టూ తిరుగుతున్నారు. కానీ ఫలితం దక్కటంలేదు. ఆసుపత్రుల్లో చేర్చుదామన్నా బెడ్లన్నీ ఫుల్ అయిన పరిస్థితి. ప్రైవేట్ ఆస్పత్రుల తీరుకూడా అంతే. పైగా లక్షలకు లక్షలు డబ్బులు గుంజుతున్నారు. ఇంతటి తీవ్రమైన పరిస్థితుల మధ్య పోలీసులు కరోనా పేషెంట్ బంధువులకు వింత పరిష్కారాలు చెబుతున్నారు. ‘రావి చెట్టు కింద కూర్చోబెట్టండి.. ఆక్సిజన్ దానంతట అదే పెరుగుతుంది’’ అంటూ ఉచిత సలహాలు ఇస్తున్నారని బాధిత బంధువులు వాపోతున్నారు.