Sanjay Raut: నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ గెలుపుపై పెదవి విరిచిన శివసేన ఎంపీ సంజయ్ రౌత్

నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ విజయంపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ పెదవి విరిచారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సంజయ్ రౌత్ స్పందిస్తూ బీజేపీ గెలుపుపై సన్నాయి నొక్కులు నొక్కారు.

Sanjay Raut: నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ గెలుపుపై పెదవి విరిచిన శివసేన ఎంపీ సంజయ్ రౌత్

Bjp Sanjay Raut

Sanjay Raut: గురువారం వెలువడిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ సత్తా చాటింది. నాలుగు రాష్ట్రలో తిరుగులేని మెజారిటీ సాధించిన భారతీయ జనతా పార్టీ.. ఆయా రాష్ట్రాల్లో స్వయంగా అధికారం నమోదు చేసేందుకు అవసరమైన మెజారిటీని సాధించి గెలుపు బావుటా ఎగురవేసింది. సార్వత్రిక ఎన్నికలకు ప్రీ ఫైనల్ గా చెప్పుకునే ఈ ఎన్నికల ఫలితాలను చూసి ప్రతిపక్షాలు, ప్రాంతీయ పార్టీలు సైతం ముక్కున వేలేసుకున్నాయి. ఇదిలాఉంటే, నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ విజయంపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ పెదవి విరిచారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై శుక్రవారం ఎంపీ సంజయ్ రౌత్ స్పందిస్తూ బీజేపీ గెలుపుపై సన్నాయి నొక్కులు నొక్కారు.

Also read: Aam Aadmi party : పంజాబ్ పీఠం దక్కింది..ఇక గుజరాత్ పై గురి పెట్టిన ‘ఆప్’

సంజయ్ రౌత్ మాట్లాడుతూ నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ గెలిచిందని..మేము బాధపడాల్సింది ఏమీ లేదన్నారు. మీ సంతోషంలో మేం భాగం అంటూ సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. మాయావతి, ఒవైసీ బీజేపీ గెలుపుకు దోహదపడ్డారని వారిద్దరికీ పద్మవిభూషణ్, భారతరత్న అవార్డులు ఇవ్వాలంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఉత్తరప్రదేశ్ లో బీజేపీ ఘన విజయం సాధించిందని.. అయినా సమాజ్ వాదీ పార్టీకి 3 రెట్లు సీట్లు పెరిగాయని సంజయ్ రౌత్ పేర్కొన్నారు. గత ఎన్నికల్లో ఎస్పీకి 42 సీట్లు రాగ ఈ ఎన్నికల్లో ఆ సంఖ్య 125కి చేరిందని.. దీన్ని బట్టి చూస్తే బీజేపీ పై ప్రజల్లో మద్దతు పెరిగిందో, వ్యతిరేకత ఉందొ అర్ధం చేసుకోవాలంటూ సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు.

Also read: AP Assembly Budget Live : రూ.2,56,256 కోట్లతో ఏపీ బడ్జెట్ 2022-23- Live Updates

గాలివాటంగా మాత్రమే బీజేపీ గెలిచిందని.. ఆమాటకొస్తే ఉత్తరాఖండ్ సీఎం ఎందుకు ఓడిపోయారు? గోవాలో ఇద్దరు ఉపముఖ్యమంత్రులు ఎందుకు ఓడిపోయారని ఆయన ప్రశ్నించారు. పంజాబ్ లో అత్యంత జాతీయవాద పార్టీ అయిన బిజెపి పూర్తిగా తిరస్కరించబడిందని సంజయ్ రౌత్ అన్నారు. ఎన్నికల వేళ ప్రధాని, హోంమంత్రి, రక్షణ మంత్రి, అందరూ పంజాబ్‌లో విపరీతంగా ప్రచారం చేసినా పంజాబ్‌లో బీజేపీ ఎందుకు ఓడిపోయిందని ప్రశ్నించిన సంజయ్ రౌత్..యూపీలో కాంగ్రెస్, శివసేనతో పోలిస్తే పంజాబ్‌లో బీజేపీ ఘోరంగా ఓడిపోయిందంటూ ఎద్దేవా చేశారు. ప్రతిపక్షాలు బలంగా లేకపోవడమే బీజేపీకి కలిసొచ్చిందంటూ సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు.

Also read: PM Modi: అహ్మదాబాద్ లో 4 లక్షల మందితో ప్రధాని మోదీ భారీ రోడ్ షో