Kota : కార్లే కోవిడ్ వార్డులు..రోగులకు సహాయం చేస్తున్న ఆరుగురు స్నేహితులు

సొంత వాహనాలను మొబైల్ కోవిడ్ వార్డులుగా మార్చివేశారు రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన కోటా ప్రాంతానికి చెందిన యువకులు. 

Kota : కార్లే కోవిడ్ వార్డులు..రోగులకు సహాయం చేస్తున్న ఆరుగురు స్నేహితులు

Kota

Turned Their Car Into Hospitals : భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ వేగంగా విస్తరిస్తోంది. పలు రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. ప్రజల ఆరోగ్యంపై పెను ప్రభావం చూపుతోంది. దేశంలో ఉన్న రాష్ట్రాల్లో దారుణమైన పరిస్థితులు నెలకొంటున్నాయి. రోగులకు పడకలు, ఆక్సిజన్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. కొంతమంది రోగులకు తోచిన సహాయం చేస్తున్నారు. అయితే..తమ సొంత వాహనాలను మొబైల్ కోవిడ్ వార్డులుగా మార్చివేశారు రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన కోటా ప్రాంతానికి చెందిన యువకులు.

ఎవరికైనా సహాయం కావాల్సి వస్తే..అక్కడకు వెళ్లి…వారికి ఆక్సిజన్ అందిస్తున్నారు. నాలుగు కార్లలో ఒకటి Ford EcoSport, మరొక కారు Volkswagen Polo. ఆరుగురు స్నేహితులు ఈ కార్లలలో వెళ్లి..ప్రతిరోజు..ఆరుగురు రోగులకు సహాయం చేస్తున్నారు. ఆక్సిజన్ సిలిండర్ల కోసం రోగులు క్యూలో నిలబడాల్సి వస్తోందని వారు తెలిపారు. ఆక్సిజన్ ఎవరికైనా అవసరం అయితే..తాము వెళ్లి…వారికి సహాయం చేయడం జరుగుతుందన్నారు. సొంత డబ్బుతో వీరు సహాయం చేస్తున్నారు. బయటి నుంచి ఎలాంటి సహాయం తీసుకోరు. భవిష్యత్ లో పూర్తిస్థాయి అంబులెన్స్ గా మార్చివేయాలని, కనీసం 40 నుంచి 50 మందికి సహాయం చేయాలని వారు యోచిస్తున్నారు. ఇందులో చాలా మంది రోగులు కోలుకున్నారు.

భారతదేశంలో ఆక్సిజన్ కొరతను తీర్చడానికి పలు దేశాలు సహాయం చేస్తున్నాయి. ప్రభుత్వాసుపత్రుల్లో కొత్త ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేయడం ప్రారంభించాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలకు ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ రైళ్లు వెళుతున్నాయి. ఆక్సిజన్ సిలిండర్ కోసం ఓ వ్యక్తి ఏకంగా 1400 కిలోమీటర్లు ప్రయాణించడం..పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

Read More : తమిళనాడు రెండువారాల సంపూర్ణ లాక్డౌన్