Ujjain Mahakal : ఉజ్జయినీ మహాకాలేశ్వర్ ఆలయంలో కూలిపోయిన సప్తరుషుల విగ్రహాలు

ప్రధాని మోదీ రూ.856 కోట్ల ఈ మహాకాల్‌ లోక్‌ కారిడార్‌ ప్రాజెక్టు మొదటిదశను ప్రారంభించారు. దీంట్లో భాగంగా సప్తరుషుల విగ్రహాలను ఏర్పాటు చేశారు. 10 అడుగుల ఎత్తు ఉండే సప్తరుషుల విగ్రహాలు కూలిపోయాయి.

Ujjain Mahakal : ఉజ్జయినీ మహాకాలేశ్వర్ ఆలయంలో కూలిపోయిన సప్తరుషుల విగ్రహాలు

Ujjain's Mahakal temple

Ujjain’s Mahakal Temple : మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని మహాకాలేశ్వర్‌ ఆలయం చాలా ప్రసిద్ది చెందిన దేవాలయం.ఈ దేవాలయం ఆవరణలో ఆర్నెల్ల కిందట ప్రతిష్ఠించిన సప్తరుషుల విగ్రహాల్లో ఆరు విగ్రహాలు ఆదివారం సాయంత్రం ఈదురుగాలుల ధాటికి కూలిపోయాయి.మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని మహాకాలేశ్వర్‌ ఆలయంలో సప్తరుషుల విగ్రహాలు కూలిపోయాయి. ఆరు నెలల క్రితం ఏర్పాటు చేసిన 10 అడుగుల ఎత్తు ఉండే సప్తరుషుల విగ్రహాలు కూలిపోయాయి. ఉజ్జయినిలో ఆదివారం (మే 28,2023) సాయంత్రం వీచిన ఈదురు గాలులకు ఈ విగ్రహాలు కూలిపోయాయి. అదే సమయంలో ఆలయంలో సందర్శకులు ఎక్కువ మంది ఉన్నా ఎవ్వరికి ఎటువంటి ప్రమాదం జరుగకపోవటం విశేషం. ఉజ్జయిని మహాకాలేశ్వర్‌ ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రం అనే విషయం తెలిసిందే.

2022 అక్టోబర్ లో ప్రధాని మోదీ రూ.856 కోట్ల ఈ మహాకాల్‌ లోక్‌ కారిడార్‌ ప్రాజెక్టు మొదటిదశను ప్రారంభించారు. ప్రాజెక్టు నిర్మాణపనుల్లో సప్తరుషుల విగ్రహాలను ఏర్పాటు చేశారు. కానీ విగ్రహాల ఏర్పాటులో అవినీతి జరిగిందని విగ్రహాల నిర్మాణంలో నాణ్యత లేదని అందుకే విగ్రహాలు కూలాయనే విమర్శలు వస్తున్నాయి.

ఆదివారం సాయంత్రం ఉజ్జయిని జిల్లాలో ఉరుములు పిడుగులతో కూడిన ఈ భారీ వర్షానికి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. మహాకాలేశ్వర్‌ ఆలయ ఆవరణలో ఆరు నెలల క్రితం సప్తరుషుల విగ్రహాలను ప్రతిష్టించారు. వీటిలో ఈదురుగాలుల ధాటికి ఆరు విగ్రహాలు కూలిపోయాయి. ఆలయ ఆవరణలో ఏర్పాటుచేసిన ఒక్కో విగ్రహం పది అడుగుల ఎత్తులో ఉంటుంది. ఆ సమయంలో సందర్శకులు పెద్ద సంఖ్యలోనే ఉన్నా ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు వెల్లడించారు. రూ.856 కోట్ల విలువైన మహాకాల్ లోక్ కారిడార్ ప్రాజెక్టులో భాగంగా 2022లో ఆలయ ప్రాంగణంలో సప్తరుషుల విగ్రహాలను ఏర్పాటుచేశారు. ప్రస్తుతం ఈదురు గాలులకు విగ్రహాలు కూలిపోవడంపై ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.