మాస్క్‌ పెట్టుకోకుండా బైటకొస్తే ఆరు నెలలు జైలే..మరో మాటేలేదు : కలెక్టర్ హెచ్చరిక

మాస్క్‌ పెట్టుకోకుండా బైటకొస్తే  ఆరు నెలలు జైలే..మరో మాటేలేదు :  కలెక్టర్  హెచ్చరిక

Six months jail term if found without mask : కరోనా కొత్త కేసులు పెరుగుతున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తమవుతున్నాయి. జనాలకు సూచనలతో పాటు హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో కరోనా కేసుల పరిస్థితి ఎలా ఉందీ అంటే మరోసారి లాక్‌డౌన్‌ అమలు చేస్తున్న పరిస్థితుల ఉండగా..మరికొన్ని ప్రాంతాల్లో లాక్ డౌన్ పెట్టాలా? అనేలా ఉన్నాయి.

ఇంకొన్ని ప్రాంతాల్లో కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడిచేయడానికి కరోనా నిబంధనలను కఠినంగా అమలుచేస్తున్నారు. దీంట్లో భాగంగా ప్రముఖ పర్యాటక కేంద్రమైన ఊటీలో మాస్క్‌ ధరించని వారికి ఆరు నెలల జైలుశిక్ష విధిస్తామని అధికారులు హెచ్చరికల జారీ చేశారు. అసలే వేసవి కాలం. దీంతో ఊటికి పర్యాటకులు పోటెత్తే అవకాశం కూడా ఉంది. దీంతో మాస్క్ పెట్టుకోవాలనే నిబంధనలు తప్పనిసరి చేశారు. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే 6 నెలలు జైలు తప్పదని జిల్లా కలెక్టర్ ఇన్నోసెంట్ దివ్య హెచ్చరిక జారీ చేశారు.

గత కొన్నిరోజులుగా ఊటీలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. ప్రజలు మాస్కులు లేకుండా బహిరంగ ప్రాంతాల్లో విచ్చలవిడిగా తిరుగుతుండటంతోపాటు సభలు, సమావేశాల్లో పాల్గొనడమే దీనికి కారణమని డాక్టర్లు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. దీంతో నీలగిరి జిల్లా కలెక్టర్‌ ఇన్సెంట్‌ దివ్య ప్రజల్ని హెచ్చరిస్తూ.. ఊటీలోని ప్రజలు, పర్యాటకులు మాస్కులు ధరించకుండా బహరంగ ప్రదేశాల్లో తిరిగితే 6 నెలల జైలుశిక్ష విధిస్తామని ప్రకటించారు.

మాస్కులు పెట్టుకోకుండా తిరిగేవారిని గుర్తించటానికి ఇప్పటికే 20 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు. మాస్కు లేకుండా పట్టుబడినవారికి ఆరు నెలల జైలుతోపాటు రూ.200 జరిమానా కూడా విధిస్తామని తెలిపారు. ఇప్పటివరకు జరిమానాల రూపంలో రూ.30.68 లక్షలు వసూలు చేశామని తెలిపారు.