Madhya Pradesh: అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రిని తోపుడు బండిపై ఆస్పత్రికి తీసుకెళ్లిన ఆరేళ్ల బాలుడు.. వీడియో వైరల్

కత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని బలియారిలో షా కుటుంబం నివసిస్తుంది. అకస్మాత్తుగా షా అస్వస్థతకు గురయ్యాడు. దీంతో స్థానికులు 108 అంబులెన్స్‌కు ఫోన్ చేసి అర్థగంట అయినా రాలేదు. రోగి పరిస్థితి విషమంగా మారుతోంది. దీంతో ఆరేళ్ల కుమారుడు తన తండ్రిని తోపుడు బండిపై పడుకోబెట్టి మూడు కిలోమీటర్లు దూరంఉన్న ప్రభుత్వాస్పత్రికి తోసుకుంటూ తీసుకెళ్లాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Madhya Pradesh: అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రిని తోపుడు బండిపై ఆస్పత్రికి తీసుకెళ్లిన ఆరేళ్ల బాలుడు.. వీడియో వైరల్

Viral Video

Madhya Pradesh: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో హృదయాన్ని కదిలించే ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. తన తండ్రిని ఆస్పత్రికి తరలించేదుకు అంబులెన్స్ అందుబాటులో లేకపోవటంతో ఆరేళ్ల కుమారుడు తోపుడు బండిపై తన తండ్రిని పడుకోబెట్టి తల్లి సహాయంతో తోసుకుంటూ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సింగ్రౌలీలో ఈ ఘటన జరిగింది. వీడియో వైరల్ కావటంతో వైద్య ఆరోగ్య‌శాఖపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.

Viral Video: 3 రోజుల పాటు శిథిలాల కింద చిన్నారి.. బయటకు వచ్చాక అంబరాన్నంటే ఆనందం

కత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని బలియారిలో షా కుటుంబం నివసిస్తుంది. అకస్మాత్తుగా షా అస్వస్థతకు గురయ్యాడు. దీంతో స్థానికులు 108 అంబులెన్స్‌కు ఫోన్ చేసి అర్థగంట అయినా రాలేదు. రోగి పరిస్థితి విషమంగా మారుతోంది. దీంతో ఆరేళ్ల కుమారుడు తన తండ్రిని ఆస్పత్రికి తరలించేందుకు పెద్ద సాహసమే చేశాడు. తల్లి, స్థానికుల సహాయంతో తన తండ్రిని తోపుడు బండిపై పడుకోబెట్టి ఆస్పత్రి తరలించాడు. ఆస్పత్రి దాదాపు మూడు కిలో మీటర్లు ఉంటుంది. మూడు కిలో మీటర్ల దూరం తల్లి సహాయంతో బాలుడు తోపుబడిని తీసుకుంటూ వెళ్లాడు.

 

ఇందుకు సంబంధించిన ఘటనను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇదికాస్త వైరల్ కావటంతో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చర్చనీయాంశగా మారింది. ఈ వీడియోపై సింగ్రౌలి అదనపు కలెక్టర్ డీ.పీ. బర్మన్ మాట్లాడుతూ.. అంబులెన్స్ అందుబాటులో లేకపోవటం వల్లే ఇలా చేయాల్సి వచ్చిందని కుటుంబ సభ్యులు పేర్కొన్నారని తెలిపారు. అయితే అంబులెన్స్ ఎందుకు సమయానికి రాలేదనే విషయంపై ఏడీఎం విచారణ జరుపుతున్నారని. అనంతరం కారకులపై చర్యలు తీసుకోవటం జరుగుతుందని అన్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవటం కొత్తకాదు. గతంలో ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం విధితమే.